News December 1, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> కొమురవెల్లి ఛైర్మన్ పదవిపై డిమాండ్ బీసీ నాయకుల అరెస్ట్
> వెల్ది గ్రామ సర్పంచ్‌గా సింగిరెడ్డి సునీత ఏకగ్రీవం
> పాలకుర్తి: కాంగ్రెస్‌లో చేరిన పలువురు బీఆర్ఎస్ నేతలు
> ఎలక్షన్ కోడ్ ఉన్నంత వరకు ప్రజావాణి రద్దు: కలెక్టర్
> రఘునాథపల్లి: నామినేషన్ వేయని 7 గ్రామపంచాయతీ వార్డు మెంబర్ల స్థానాలు
> నామినేషన్ క్లస్టర్ గ్రామపంచాయతీలను పరిశీలించిన డీసీపీ
Similar News
News December 1, 2025
జగిత్యాల: ‘ఈ సంవత్సరం 83 కేసులు నమోదు’

ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా జగిత్యాల కలెక్టరేట్ నుంచి మెడికల్ కాలేజీ వరకు నిర్వహించిన ర్యాలీని అదనపు కలెక్టర్ బి.రాజగౌడ్ ప్రారంభించారు. ఎయిడ్స్‌కు నివారణే మేలని, యువత జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జిల్లాలో 2,573 మంది ఏఆర్‌టి చికిత్స పొందుతున్నారని వైద్య అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం 83 కేసులు నమోదయ్యాయని చెప్పారు. పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు.
News December 1, 2025
మెదక్: శిక్షణలో ప్రతిభ చూపిన కానిస్టేబుల్

మెదక్ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ ప్రశాంత్ శిక్షణలో ప్రతిభ చూపడంతో ఎస్పీ డివి శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ మహేందర్ అభినందించారు. మొయినాబాద్ ఐఐటీఏ శిక్షణకు వివిధ జిల్లా నుంచి 51 మంది హాజరయ్యారు. జిల్లాకు చెందిన ప్రదీప్, ప్రశాంత్, రాకేష్ హాజరయ్యారు. ఫైరింగ్, పీపీటీ విభాగాల శిక్షణలో ప్రశాంత్ ఉత్తమ ప్రతిభ చూపి మెడల్ పొందాడు. ప్రశాంత్‌ను ఎస్పీ అభినందించారు.
News December 1, 2025
క్యారెట్ సాగు – ముఖ్యమైన సూచనలు

క్యారెట్ శీతాకాలం పంట. దీన్ని ఆగస్టు-డిసెంబర్ మధ్యలో నాటుకోవచ్చు. నాణ్యమైన దిగుబడి రావాలంటే 18-24 డిగ్రీల సెల్సియన్ ఉష్ణోగ్రత అవసరం. క్యారెట్ సాగుకు మురుగునీటి వసతి గల లోతైన, సారవంతమైన గరప నేలలు అత్యంత అనుకూలం. బరువైన బంకనేలలు పనికిరావు. నేల ఉదజని సూచిక 6.5గా ఉంటే మంచిది. ఎకరాకు 2 కేజీల విత్తనాలు అవసరం. ప్రతి 15 రోజుల తేడాలో విత్తనాలు విత్తుకుంటే డిమాండ్‌కు అనుగుణంగా మంచి దిగుబడి సాధించవచ్చు.


