News February 26, 2025

జనగామ జిల్లాలో పండుగపూట విషాదం

image

జనగామ జిల్లాలో పండగ పూట విషాదం నెలకొంది. స్థానికుల వివరాలు.. జనగామ మండలం గానుగుపహాడ్ గ్రామంలో కుటుంబ కలహాలతో బుధవారం రెండేళ్ల బిడ్డతో సహా తల్లి బావిలో దూకింది. ఇద్దరిని బావి నుంచి బయటికి తీశారు. అప్పటికే రెండేళ్ల పాప మృతిచెందగా.. కొన ఊపిరితో ఉన్న తల్లి గౌరీ ప్రియను స్థానికులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News September 16, 2025

ప్రతి రైతుకు యూరియా అందే విధంగా చూడాలి: కలెక్టర్

image

ప్రతి రైతుకు యూరియా అందే విధంగా ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సూచించారు. మరిపెడ PACS పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. సొసైటీ వద్దకు వచ్చిన రైతులకు నీడ, మంచి నీటి వసతులు కల్పించాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా పంపిణీ చేయాలని సూచించారు. యూరియా సరఫరా చేస్తున్న ప్రక్రియను పారదర్శకంగా అమ్మకాల రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు.

News September 16, 2025

తిరుపతి: APR సెట్-24 కన్వీనర్‌గా ఉష

image

రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో వివిధ కోర్సులకు సంబంధించిన పీహెచ్‌డీ ప్రవేశాలకు నిర్వహించనున్న ఏపీఆర్ సెట్ నిర్వహణ బాధ్యతలు శ్రీపద్మావతి మహిళా వర్సిటీ ఆచార్యులకు దక్కాయి. ఆర్‌సెట్ కన్వీనర్‌గా వర్సిటీ బయోటెక్నాలజీ విభాగాధిపతి ఆచార్య ఆర్.ఉష, కోకన్వీనర్‌గా అదే భాగానికి చెందిన ఎన్.జాన్ సుష్మను నియమిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

News September 16, 2025

HYD మెట్రోలో సెక్యూరిటీ గార్డులుగా ట్రాన్స్‌జెండర్లు

image

TG: హైదరాబాద్‌లోని మెట్రో రైళ్లలో ట్రాన్స్‌జెండర్లను సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 20 మంది హిజ్రాలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అపాయింట్‌మెంట్ లెటర్స్ అందజేశారు. గార్డుల నియామకాల కోసం 400 మంది దరఖాస్తు చేసుకోగా నైపుణ్యం ఉన్న వారిని ఎంపిక చేసినట్లు వివరించారు. ట్రాన్స్‌జెండర్లు సమాజంలో గౌరవంగా బతకాలనే ఉద్దేశంతోనే ఈ అవకాశం కల్పించినట్లు మంత్రి తెలిపారు.