News March 11, 2025
జనగామ జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రత!

జనగామ జిల్లాలో ఎండ భగ్గుమంటోంది. జిల్లాలోని రైతులు, ఉద్యోగులు, ఇతర ప్రదేశాలకు ప్రయాణించేవారు ఎండ కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడే వడగాలులు మొదలవుతున్నాయి. జిల్లాలో ఈరోజు 32 నుంచి 34 డిగ్రీలు, రేపు 32-35 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ సూచికలు చెబుతున్నాయి. జిల్లాలో పలు చోట్ల ఇప్పటికే చెక్ డ్యామ్‌లు, బోరుబావులు ఎండిపోయాయి.
Similar News
News July 9, 2025
KNR: SRR (అటనామస్) కళాశాల డిగ్రీ సెమిస్టర్ ఫలితాల విడుదల

కరీంనగర్‌లోని SRR ప్రభుత్వ (అటనామస్) కళాశాల డిగ్రీ 2వ, 4వ, 6వ సెమిస్టర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను కళాశాల ప్రిన్సిపల్ కె.రామకృష్ణ, SU కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డి.సురేశ్ కుమార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శ్రీనివాస్, అధ్యాపకుల బృందంతో కలిసి బుధవారం విడుదల చేశారు. 6వ సెమిస్టర్‌తోపాటు డిగ్రీ కోర్సు ఉత్తీర్ణులైన వారు 79%, 4వ సెమిస్టర్‌లో 38%, 2వ సెమిస్టర్‌లో 30% ఉత్తీర్ణత సాధించారు.
News July 9, 2025
పాడేరు: ‘టీచర్లే లేని పాఠశాలలకు మెగా పీటీఎం అవసరమా?’

అల్లూరి జిల్లా వ్యాప్తంగా గల 11 మండలాల పరిధిలో వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునః ప్రారంభమై నేటి వరకు ఉపాధ్యాయులు లేని పాఠశాలల్లో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ ఎలా నిర్వహిస్తారని గిరిజన విద్యార్థి సంఘం నాయకులు మాధవ్, బాబూజీ, కిషోర్ ప్రశ్నించారు. బుధవారం పాడేరులో వారు మాట్లాడారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించి గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడాలని డిమాండ్ చేశారు.
News July 9, 2025
క్యాబినెట్ భేటీ కీలక నిర్ణయాలివే..

AP: CM చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ సమావేశమైన మంత్రివర్గం కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. * రూ.672 కోట్ల ధాన్యం బకాయిల విడుదలకు అంగీకారం * హడ్కో నుంచి తీసుకున్న రుణాలకు గ్యారంటీ ప్రతిపాదనకు ఆమోదం * అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏర్పాటుకు నిర్ణయం * కుళాయి నీరు అందించేందుకు రూ.10వేల కోట్ల రుణాల సమీకరణకు అనుమతి * నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు, సరిహద్దుల విస్తరణకు ఆమోదం