News October 21, 2025
జనగామ జిల్లాలో 4.2 మి.మీ. వర్షపాతం

జనగామ జిల్లాలో గడచిన 24 గంటల్లో కురిసిన వర్షపాతం వివరాలు మండలాల వారీగా ఇలా ఉన్నాయి. తరిగొప్పుల 3.2 మి.మీ., చిల్పూర్ 2.0, జఫర్గడ్ 7.6, స్టేషన్‌ఘన్పూర్ 2.8, రఘునాథపల్లి 9.6, నర్మెట 1.6, జనగామ 3.4, లింగాల ఘనపూర్ 2.0, దేవరుప్పుల 12.2, కొడకండ్ల 6.0, మొత్తం 4.2 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.
Similar News
News October 21, 2025
రైల్వే,ఎన్‌హెచ్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిపెట్టండి: జేసీ

విస్తృత ప్రజా ప్రయోజనాలు ముడిపడిన రైల్వే, జాతీయ రహదారుల (ఎన్‌హెచ్) ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆర్డీఓలు, తహశీల్దార్లతో ఆమె సమావేశం నిర్వహించి, జిల్లా పరిధిలోని రైల్వే, ఎన్‌హెచ్ ప్రాజెక్టులకు సంబంధించిన స్థితిగతులపై సమీక్షించారు.
News October 21, 2025
రేపు అన్ని జూనియర్ కాలేజీలకు సెలవు

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బుధవారం అన్ని జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు RIO వర ప్రసాద్ తెలిపారు. నెల్లూరు కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు అన్నింటికీ సెలవు ప్రకటించినట్లు వివరించారు. ఉత్తర్వులు ఉల్లంఘించిన విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News October 21, 2025
ప్రపంచ నేతలు.. ఆసక్తికర విషయాలు!

అగ్రదేశాలకు అధినేతలుగా పని చేసిన/చేస్తున్న శక్తిమంతమైన నేతలు వాళ్లు. తమ పాలనతో చెరగని ముద్ర వేశారు. వారి గతంలోని ఆసక్తికర విషయాలు.. *మన్మోహన్ సింగ్-పబ్లిక్ సర్వీసులోకి రాకముందు ప్రొఫెసర్. *ఏంజెలా మెర్కెల్-క్వాంటమ్ కెమిస్ట్రీలో డాక్టరేట్. *జెలెన్‌స్కీ-కమెడియన్. *విన్‌స్టన్ చర్చిల్-చిత్రకారుడు. *బైడెన్-లైఫ్‌గార్డుగా పని చేశారు. *ఒబామా-ఐస్ క్రీమ్ స్కూపర్‌గా పని చేశారు. పుతిన్-ఇంటెలిజెన్స్ ఆఫీసర్.