News March 3, 2025

జనగామ జిల్లా కలెక్టర్‌గా ఏడాది పరిపాలన పూర్తి

image

జనగామ జిల్లా కలెక్టర్‌గా షేక్ రిజ్వాన్ బాషా భాధ్యతలు చేపట్టి ఏడాది పరిపాలన పూర్తి అయింది. ఈ ఏడాదిలో విద్యా, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సుమారు 50 మంది ఉద్యోగులపై వేటు వేశారు. పదో తరగతి విద్యార్ధుల కోసం ప్రత్యేకంగా విజయోస్తు కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలపై ఆకస్మిక తనిఖీలు చేస్తూ తనదైన శైలిలో ప్రత్యేకత చాటుతున్నారు.

Similar News

News March 3, 2025

చిరంజీవి గారూ.. కూతుళ్లూ వారసులే: కిరణ్ బేడీ

image

‘వారసత్వం కోసం ఓ మగబిడ్డను కనమని చరణ్‌ను అడుగుతుంటా’ అని ఇటీవల చిరంజీవి చేసిన <<15434876>>వ్యాఖ్యలు<<>> వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మాజీ ఐపీఎస్ కిరణ్ బేడీ తాజాగా స్పందించారు. ‘చిరంజీవి గారూ.. కూతుళ్లు కూడా వారసులేనన్న విషయాన్ని నమ్మండి, గుర్తించండి. మీరు ఎలా వారిని పెంచుతారనే దానిపైనే ఇది ఆధారపడి ఉంటుంది. అమ్మాయిలను పెంచిన పేరెంట్స్ నుంచి నేర్చుకోండి. అమ్మాయిలేం తక్కువ కాదు’ అని ట్వీట్ చేశారు.

News March 3, 2025

ఇండియన్‌ని కాల్చిచంపిన జోర్డాన్ ఆర్మీ

image

జోర్డాన్ నుంచి అక్రమంగా ఇజ్రాయిల్‌‌లోకి ప్రవేశిస్తున్న భారతీయుణ్నిఅక్కడి బలగాలు కాల్చిచంపాయి. కేరళకు చెందిన థామస్ గాబ్రియల్, ఎడిసన్ అనే ఇద్దరు వ్యక్తులు అక్రమంగా సరిహద్దు దాటాలని ప్రయత్నించగా ఆర్మీ కాల్పులు జరిపింది. థామస్ అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. వీరిద్దరూ టూరిస్ట్ వీసాపై అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది.

News March 3, 2025

టైమ్ లేదు.. తక్షణమే పిల్లల్ని కనండి: TN CM

image

ప్రజలు తక్షణమే పిల్లల్ని కనాలని TN CM స్టాలిన్ కోరారు. రాష్ట్రం విజయవంతంగా అమలు చేసిన ఫ్యామిలీ ప్లానింగే ఇప్పుడు డిస్‌అడ్వాంటేజీగా మారిందన్నారు. జనాభా ఆధారిత డీలిమిటేషన్‌ తమిళనాడు రాజకీయ ప్రాతినిధ్యంపై ప్రభావం చూపిస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు తన మొర ఆలకించాలని కోరారు. ‘గతంలో కొంత టైమ్ తీసుకొని పిల్లల్ని కనాలని చెప్పేవాళ్లం. ఇప్పుడు పరిస్థితి మారింది. మనమిది చెప్పాల్సిందే’ అని అన్నారు.

error: Content is protected !!