News February 28, 2025
జనగామ జిల్లా కలెక్టర్ ఆదేశాలు.. ఆకస్మిక తనిఖీ

జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఆదేశాల మేరకు మండల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు, క్లస్టర్, నోడల్ అధికారులందరూ జిల్లాలోని వివిధ మండలాల్లోని రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాలను సందర్శించారు. వాటిల్లోని పరిశుభ్రతా చర్యలు, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యార్థుల శ్రేయస్సు, బోధనా సామర్థ్యాలు, ఆహార భద్రత, తదితరాల వంటి వాటిని పరిశీలించి, మెనూ ప్రకారం ఆహారం అందించాలని కోరారు.
Similar News
News December 24, 2025
పెద్దపల్లిలో ప్రిమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

పెద్దపల్లిలో జూనియర్ కళాశాల మైదానంలో మొదటిసారిగా పెద్దపల్లి ప్రిమియర్ లీగ్ (PPL) క్రికెట్ టోర్నమెంట్‌ను MLA చింతకుంట విజయరమణరావు ప్రారంభించారు. క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడి, యువతను చెడు వ్యసనాల నుంచి దూరంగా ఉంచి క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలని సూచించారు. టోర్నమెంట్లో పాల్గొనే ప్రతి జట్టుకూ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మాజీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
News December 24, 2025
సంగారెడ్డి: ‘దళితులపై దాడి.. చర్యలు తీసుకోవాలి’

సజ్జాపూర్ గ్రామంలో దళితులపై దాడి చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్
బక్కి వెంకటయ్య ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో ఇన్‌ఛార్జ్ కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ పారితోష్ పంకజ్‌లతో బుధవారం సమావేశం అయ్యారు. దాడికి సహకరించిన సర్పంచిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. కోహిర్ ఎస్ఐ, గ్రామ పంచాయతీ కార్యదర్శులపై కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News December 24, 2025
MDK: క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

క్రిస్మస్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పాపులను సైతం క్షమించమనే త్యాగశీలత, ఓర్పు, సహనం, అహింసా శాంతి మార్గాన్ని యేసు క్రీస్తు మానవ సమాజానికి చూపించారని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో క్రిస్టియన్ మైనారిటీలకు దేశానికే ఆదర్శంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశామని గుర్తు చేశారు.


