News April 19, 2025

జనగామ జిల్లా చరిత్ర, ప్రత్యేకతలు ఇవే!

image

జనగామ జిల్లాకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది 11వ శతాబ్దంలో కల్యాణి చాళుక్యుల 2వ రాజధానిగా నిలిచింది. 1195-1323 వరకు కాకతీయుల పాలనలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. జనగామలో జైన తీర్థంకరుల శిల్పాలు కనుగొనబడ్డాయి. ఇది మేఘాలిథిక్ యుగంలో జైనిజం ప్రాచుర్యాన్ని సూచిస్తుంది. కాగా, జిల్లాలో జీడికల్ రామచంద్ర స్వామి, పాలకుర్తి సోమేశ్వరాలయాలు ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి. మీది ఏమండలం? మీ గ్రామ ప్రత్యేకత కామెంట్ చేయండి.

Similar News

News April 20, 2025

DSC: అనంతపురం జిల్లాలో ఖాళీలు ఎన్నంటే?

image

రాష్ట్రంలో 16,347 పోస్టులతో ఇవాళ ఉదయం 10 గంటలకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుంది. అనంతపురం జిల్లాలో 145 ఎస్ఏ పీఈటీ, 202 ఎస్జీటీ పోస్టులతో కలిపి మొత్తం 807 ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. అలాగే గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలకు సంబంధించి 2 ఎస్జీటీ పోస్టులతో కలిపి జిల్లాలో 4 పోస్టులు ఉన్నాయి.

News April 20, 2025

HYD: పీహెచ్డీ కోర్సు వర్క్ పరీక్ష తేదీల ఖరారు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీహెచ్డీ కోర్స్ వర్క్ (ప్రీ పీహెచ్డీ) పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ప్రీ పీహెచ్డీ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలను ఈనెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్ సైట్‌లో చూసుకోవాలని సూచించారు.

News April 20, 2025

మోడల్ స్కూల్స్ అడ్మిషన్ టెస్ట్: రేపే హాల్ టికెట్లు

image

TG: మోడల్ స్కూళ్లలో సీట్ల భర్తీకి ఈనెల 27న నిర్వహించే ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు రేపు అందుబాటులోకి రానున్నాయి. https://telanganams.cgg.gov.in/ వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈనెల 27న ఉ.10 నుంచి మ.12 గంటల వరకు 6వ తరగతిలో ప్రవేశాలకు, అదే రోజు మ.2 నుంచి సా.4 గంటల వరకు 7-10 తరగతుల్లో ప్రవేశాలకు పరీక్ష జరగనుంది.

error: Content is protected !!