News September 16, 2025
జనగామ జిల్లా పర్యావరణ పరిరక్షణ బ్రాండ్ అంబాసిడర్‌గా గౌసియా బేగం

జనగామ జిల్లా పర్యావరణ పరిరక్షణకు బ్రాండ్ అంబాసిడర్‌గా GCDO గౌసియా బేగంను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర హరితదల డైరెక్టర్ WC ప్రసన్నకుమార్ నియామకపత్రం జారీచేశారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ గౌసియా బేగంకు అందజేశారు. ఈ సందర్భంగా అమెను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. గౌసియా బేగం మాట్లాడుతూ.. తనకు అప్పగించిన బాధ్యతను శ్రద్ధగా నిర్వర్తించి, పర్యావరణ జిల్లాకు కృషి చేస్తానని తెలిపారు.
Similar News
News September 16, 2025
దేవీ నవరాత్రులు ఘనంగా నిర్వహించాలి: రమేశ్ బాబు

కాకినాడ జిల్లాలోని దేవాలయాల కార్యనిర్వహణాధికారులతో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేశ్ బాబు సమావేశమయ్యారు. కాకినాడ బాలాత్రిపురసుందరి ఆలయంలో జరిగిన ఈ సమావేశంలో దేవీ నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. విజయవాడ, ఇతర ఆలయాలకు డిప్యూటేషన్‌పై వెళ్లేవారు ఒక రోజు ముందుగా రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఆలయ నిధుల లావాదేవీలపై చర్చించారు.
News September 16, 2025
మేడారం గద్దెల విస్తరణలో వ్యూహాత్మకంగా ముందుకే..!

మేడారం వన దేవతల గద్దెల విస్తరణలో ప్రభుత్వం ముందుకే వెళ్తోంది. కోటిన్నర మంది భక్తులు తరలివచ్చే జాతరలో ఇరుకైన ఈ ప్రాంగణం విస్తరణకు గత ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించగా సాధ్యం కాలేదు. ప్రస్తుత సర్కారు ప్రయత్నం మొదలు పెట్టింది. ఆదివాసీ సంఘాలు విబేధించడం, రాజకీయ ప్రమేయం పెరగడంతో మంత్రి సీతక్క వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన పూజారులతో కౌంటర్ ఇప్పిస్తున్నారు. విమర్శలకు చెక్ పెడుతున్నారు.
News September 16, 2025
చర్లపల్లి-తిరుపతి-చర్లపల్లి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు

ఇటీవల నంద్యాల మీదుగా ప్రయాణించే విధంగా ప్రకటించిన చెర్లపల్లి-తిరుపతి – చర్లపల్లి (07013/07014) వీక్లీ రైలును కార్యాచరణ పరిమితుల దృష్ట్యా అక్టోబర్, నవంబర్ నెలలకు గాను రద్దు చేశారు. దీనికి బదులుగా ఆ నెలల్లో 07001/07002 నంబర్ గల ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలును ఏర్పాటు చేశారు. రైలు సమయాలలో ఎటువంటి తేడా లేదు. ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులు కోరారు.