News January 27, 2026
జనగామ: టీచర్ వినూత్న ఆలోచన.. డ్రెస్సులు పంపిణీ

సంక్రాంతి సెలవులు ముగిసిన వెంటనే విద్యార్థులు పాఠశాలకు తిరిగి వచ్చేలా వారిని ప్రోత్సహించేందుకు ఓ టీచర్ వినూత్న ఆలోచన చేశారు. స్టే.ఘ.మం.శివునిపల్లిలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు బి.సురేందర్ రెడ్డి సంక్రాంతి సెలవులు ముగిసిన మరుసటి రోజే పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు డ్రెస్సులు పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం రూ.14 వేల విలువైన డ్రస్సులను పంపిణీ చేశారు.
Similar News
News February 6, 2026
INDతో మ్యాచును బాయ్‌కాట్ చేస్తే పాక్‌కే దెబ్బ!

T20 WCలో భారత్‌తో మ్యాచును బాయ్‌కాట్ చేస్తే పాకిస్థాన్‌కు గ్రూప్ స్టేజ్ దాటడమే కష్టంగా మారొచ్చు. ఈ మ్యాచ్ ఆడకపోతే గ్రూప్‌లోని మిగతా జట్లపై(USA, నమీబియా, నెదర్లాండ్స్) కచ్చితంగా గెలవాలి. లేదంటే NRRపై ఆధారపడాల్సి వస్తుంది. 2024 WCలో PAKను USA ఓడించింది. దీంతో ఈసారీ ఆ టీమ్ నుంచి పాక్‌కు ముప్పు ఉంది. ఈ నేపథ్యంలో INDతో మ్యాచ్ ఆడితేనే గెలుపు కోసం ప్రయత్నించేందుకు PAKకు మరో అవకాశం(మ్యాచ్) ఉంటుంది.
News February 6, 2026
ఆయిల్ ఫామ్.. టన్నుకు రూ.224 అదనం

AP: తెలంగాణా కంటే రాష్ట్రంలోని ఆయిల్ ఫామ్ రైతులకు టన్నుకు అదనంగా రూ.224 చెల్లిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 2025-26 ఏడాదిలో 20.01% ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ రేషియో(ఓయూఆర్)ను ప్రభుత్వం ప్రకటించిందని.. దీని వల్ల టన్ను ఆయిల్ ఫామ్‌కు రూ.20,680 ధర లభించిందని తెలిపారు. తెలంగాణలో జనవరికి సంబంధించి పామాయిల్ రైతులకు టన్నుకి రూ.20,456 ధర వస్తే.. ఏపీలో అదనంగా రూ.224 లభించిందని పేర్కొన్నారు.
News February 6, 2026
హిందూపురంలో కానిస్టేబుల్‌పై కత్తితో దాడి

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రవిపై మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఓ కేసులో నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై ఎరుకల కావిడి నాగేంద్ర తిరగబడినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన అత్త-కోడలు గ్యాంగ్ రేప్ కేసులో ఇతడే ప్రధాన నిందితుడు.


