News October 10, 2025
జనగామ: టీహెచ్ఆర్ నమోదులో అష్టకష్టాలు

జనగామ జిల్లాలోని అంగన్వాడీ, పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలకు అందించే రేషన్(టీహెచ్ఆర్)లో కేంద్రాల నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. టీహెచ్ఆర్ యాప్‌లో పిల్లల తల్లిదండ్రుల ఫొటో క్యాప్చర్ నమోదులో అష్టకష్టాలు పడుతున్నారు. సాంకేతిక సమస్యల కారణంగా గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. కొన్ని గ్రామాల్లో ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంది. తల్లిదండ్రుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Similar News
News October 10, 2025
3,500 పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

కెనరా బ్యాంకులో 3,500 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి OCT 12 చివరితేదీ. APలో 242, TGలో 132 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ పాసైన 20-28ఏళ్ల వయస్కులు అర్హులు. ఎంపికైన అప్రెంటిస్‌లకు నెలకు రూ.15వేలు చెల్లిస్తారు. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌లో ఎన్‌రోల్ చేసుకోవాలి. వెబ్‌సైట్: www.canarabank.bank.in
* ప్రతి రోజూ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ కేటగిరీ<<>>కి వెళ్లండి.
News October 10, 2025
కడప: ఇతనో బడా స్మగ్లర్.. 128 కేసులు

కడప జిల్లా దువ్వూరు మండలం పుల్లారెడ్డి పేటకు చెందిన దస్తగిరి రెడ్డిపై పోలీసులు పీడీ యాక్ట్ కేసు నమోదు చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న అతడిని అంతర్ రాష్ట్ర స్మగ్లర్‌గా గుర్తించారు. 8 ఏళ్లలో అతనిపై 128 కేసులు నమోదైయ్యాయి. ఇందులో 90 ఎర్రచందనం కేసులు, 38 దొంగతనం కేసులు ఉన్నాయి. గతంలో మూడుసార్లు పీడీ యాక్ట్ కింద జైలుకు వెళ్లి వచ్చాడని ఎర్రచందనం ప్రత్యేక దళ సీఐ శంకర్ రెడ్డి తెలిపారు.
News October 10, 2025
రావికమతం: ‘జిల్లాలో అన్ని ఆరోగ్య కేంద్రాలకు వైద్యాధికారుల నియామకం’

జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు సమ్మెలో లేని కాంట్రాక్టు వైద్యులను సర్దుబాటు చేశామని DM&HO హైమావతి శుక్రవారం తెలిపారు. పిచ్చికుక్క కరిచిన విద్యార్థుల ఆరోగ్యంపై సమీక్షించేందుకు శుక్రవారం రావికమతం వచ్చారు. వైద్యాధికారులు సమ్మెలో ఉన్నందున ప్రతి ఆరోగ్య కేంద్రానికి ఒక వైద్యుడు విధులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో 46 PHCలు, 9 CHCలలో వైద్య సేవలకు అంతరాయం లేదని చెప్పారు.