News October 21, 2025

జనగామ: టెండర్ల గడువు పొడిగింపు: ఎక్సైజ్ అధికారి

image

ఈనెల 23 వరకు మద్యం టెండర్ల గడువు పొడిగించినట్లు జనగామ జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారిని అనిత తెలిపారు. టెండర్లకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు వడ్లకొండ రోడ్డులోని ఎక్సైజ్ కార్యాలయంలో పేర్కొన్న తేదీ వరకు టెండర్లు దాఖలు చేసుకోవచ్చన్నారు. ఈనెల 27న లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాలను కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News October 21, 2025

బాపట్ల జిల్లా పర్యాటక రంగానికి కీలకమైనది: కలెక్టర్

image

బాపట్ల జిల్లా పర్యాటక రంగానికి చాలా కీలకమైనదిగా ఉందని కలెక్టర్ వినోద్ కుమార్ మంగళవారం అన్నారు. ఆరు మండలాలలో సముద్ర తీర ప్రాంతం ఉందన్నారు. సముద్ర తీర ప్రాంతాలైన 17 పంచాయతీలలో బహిరంగ మలమూత్ర విసర్జన నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. 8 పంచాయతీ పరిధిలోని 9 బీచ్‌లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించాలని ఆదేశించారు. ఈ మేరకు సదరు పంచాయతీ సమావేశాలలో తీర్మానం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

News October 21, 2025

ప్రజల్లో సంతృప్తికర స్థాయి పెరగాలి: సీఎం చంద్రబాబు

image

ఆర్టీజీఎస్‌లో ప్రభుత్వ శాఖలు అందిస్తున్న వివిధ పౌర సేవలు, సంక్షేమ పథకాలపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇబ్బందులు లేకుండా ప్రజలకు అందే సేవలు, వారిలో సంతృప్తి స్థాయి సాధించే అంశంపై సమీక్షలో ప్రధానంగా చర్చించారు. సమాచార శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి, సీఎస్ విజయానంద్, ఐటీ, ఆర్టీజీ, ఆర్ధిక, ప్రణాళిక శాఖ ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు.

News October 21, 2025

దీపిక-రణ్‌వీర్ కూతురిని చూశారా?

image

బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె తమ కూతురు దువా ఫొటోను తొలిసారి షేర్ చేశారు. దీపావళి సందర్భంగా తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటో చూసిన అభిమానులు వారి కూతురు చాలా క్యూట్‌గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. దీపిక, రణ్‌వీర్ జంటకు 2018లో వివాహం జరగగా గతేడాది సెప్టెంబర్‌లో పాప జన్మించింది.