News December 12, 2025

జనగామ: నవోదయ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి!

image

2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశం కోసం నిర్వహించే జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి పింకేశ్ కుమార్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 641 మంది విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు హాజరుకానున్నారు. దీంతో పరీక్షను ప్రశాంతంగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News December 13, 2025

రాష్ట్రంలో 60 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

<>తెలంగాణ <<>>స్టేట్ ఫొరెన్సిక్ సైన్స్ లాబోరేటరీలో 60 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి ఇంటర్, BA, BSc, MSc, .M.Tech, MCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, Lab టెక్నీషియన్, Lab అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఈ పోస్టులను భర్తీ చేయనుంది. వెబ్‌సైట్: https://www.tgprb.in

News December 13, 2025

NZB: మద్యం దుకాణాలు బంద్

image

2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మద్యం దుకాణాలను మూసి వేయనున్నామని NZB జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి శుక్రవారం తెలిపారు. 14వ తేదీ ఎన్నికల కౌంటింగ్ ముగిసే వరకు నిజామాబాద్ రూరల్, ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, సిరికొండ, జక్రాన్పల్లి మండలాల పరిధిలో మద్యం దుకాణాలు మూసి ఉంచనున్నట్లు తెలిపారు.

News December 13, 2025

ఆసిఫాబాద్: ఎన్నికలు.. అక్క(BRS) Vs చెల్లి (కాంగ్రెస్)

image

ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గాడపల్లి గ్రామపంచాయతీ ఎన్నికల బరిలో సొంత అక్కాచెల్లెళ్లు నిలవడం చర్చనీయాంశంగా మారింది. అక్క శంకరమ్మ BRS బలపరుస్తున్న అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, చెల్లి విమల కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా బరిలో ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం తమకు కలిసివచ్చే అంశంగా విమల భావిస్తున్నారు. ఇద్దరూ పోటీలో ఉండటంతో గాడపల్లి పంచాయతీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది.