News July 9, 2025
జనగామ: నిరుద్యోగ యువతకు దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్‌లోని TGMBCDC ఆధ్వర్యంలో ఎంబీసీ నిరుద్యోగ యువతకు 4 రోజుల పాటు ఉచిత శిక్షణ కల్పించనున్నారు. సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్, రెస్యూమ్ బిల్డింగ్ వంటి అంశాల్లో శిక్షణతోపాటు టీఏ, భోజనం, వసతి సదుపాయాలు ఉంటాయని జనగామ జిల్లా బీసీ అభివృద్ధి అధికారి బి.రవీందర్ మంగళవారం తెలిపారు. జిల్లాలో ఆసక్తి గల అభ్యర్థులు జులై 14లోగా దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు.
Similar News
News July 9, 2025
నేడు చిత్తూరు జిల్లాలో జగన్ పర్యటన

AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో మామిడి రైతులను పరామర్శించనున్నారు. రైతులతో సమావేశమై, వారి కష్టాలను స్వయంగా తెలుసుకోనున్నారు. ప్రస్తుతం పులివెందులలో ఉన్న జగన్ హెలికాఫ్టర్‌లో ఉ.11 గం.కు కొత్తపల్లికి రానున్నారు. హెలిప్యాడ్ వద్ద 30 మంది, మార్కెట్ యార్డులో జగన్‌తో పాటు 500 మంది మాత్రమే ఉండాలని పోలీసులు ఆంక్షలు విధించారు.
News July 9, 2025
నేడు తెలంగాణ యూనివర్సిటీలో జాబ్ మేళా

తెలంగాణ యూనివర్సిటీలో బుధవారం కెమిస్ట్రీ విభాగం, హెటిరో సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నేడు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు HOD సాయిలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయ పరిధిలో కెమిస్ట్రీ విభాగంలో పీజీ విద్యనభ్యసించిన విద్యార్థులు జాబ్ మేళాకు హాజరు కావాలన్నారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అర్హులను ఎంపిక చేసి ధృవ పత్రాలు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
News July 9, 2025
కల్వకుర్తిలో ఈ ప్రాచీన కవి తెలుసా..?

తనకున్న సాహిత్య అభిరుచి ద్వారా ఎన్నో రచనలు చేసిన వ్యక్తి వేపూరు హనుమద్దాస్. ఈయన కల్వకుర్తి మండలంలోని వేపూరుకి చెందిన ప్రాచీన కవి. రాముడిపై తనకున్న భక్తితో అనేక సంకీర్తనలు రాసి ప్రాచుర్యం పొందారు. ఈ కవి రామాయణాన్ని బతుకమ్మ పాట రూపంలో రచించారు. ఇప్పటికీ గ్రామాలలో భక్తులు ఈయన రాసిన కీర్తనలను పాడుతూ ఉంటారు.