News February 7, 2025

జనగామ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సు

image

తమిళనాడులో ఘనంగా నిర్వహించే అరుణాచల గిరి ప్రదర్శన దర్శనానికి జనగామ డిపో నుంచి ప్రత్యేక బస్సును నడుపుతున్నట్లు జనగామ డిపో మేనేజర్ స్వాతి ప్రకటనలో తెలిపారు. పెద్దలకు రూ.4 వేలు, పిల్లలకు రూ.2,500 టికెట్ ధరలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ నెల 10వ తేదీన బయలుదేరి 13వ తేదీకి తిరిగి జనగామకు చేరుకుంటుందన్నారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News February 7, 2025

నర్సీపట్నం యాక్సిడెంట్‌లో మరణించిన ఉద్యోగి వివరాలు 

image

నర్సీపట్నంలో శుక్రవారం ఉదయం బస్సు కిందపడి <<15385488>>మరణించిన <<>>ఫారెస్ట్ ఉద్యోగి వివరాలు తెలిసాయి. కొయ్యూరు మండలం మర్రుపాక సెక్షన్ ఆఫీసర్‌గా ఆర్.పుట్టన్న విధులు నిర్వహిస్తున్నారు. నర్సీపట్నంలో నివాసముండే పుట్టన్నకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం విధులకు బయలుదేరిన పుట్టన్న రోడ్డు ప్రమాదంలో మరణించడం అందరిలో విషాదం నిలిపింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బంది విచారణ వ్యక్తం చేశారు.

News February 7, 2025

వికారాబాద్ జిల్లాలో 70,219 మందికి రైతు భరోసా

image

రెండో రోజుల్లో వికారాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 70,219 మంది రైతులకు రైతు భరోసా డబ్బులు జమ అయ్యాయని జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని 70,219 మంది రైతుల ఖాతాలో రూ.32,99,94,264 కోట్లు జమయ్యాయని తెలిపారు. మిగతా రైతులకు సైతం త్వరలో డబ్బులు జమవుతాయన్నారు.

News February 7, 2025

ఖమ్మం: వినూత్న ప్రయోగం.. విద్యార్థులకు కలెక్టర్ లేఖ

image

పదో తరగతి ఫలితాల్లో 100% సాధించడమే లక్ష్యంగా విద్యార్థుల్లో భయం పోగొట్టడం, ధైర్యంగా హాజరయ్యేలా సిద్ధం చేసేందుకు సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఖమ్మం ఎన్నెస్సీ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన సదస్సుకు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ హాజరు కాగా మంచి స్పందన వచ్చింది. దీంతో ప్రతీ విద్యార్థికి తన సంతకంతో కూడిన లేఖ అందించాలని ఆయన నిర్ణయించారు. ఈవిషయమై డీఈవో ఉద్యోగులతో లేఖ తయారీపై సమీక్షించారు.

error: Content is protected !!