News February 5, 2025

జనగామ: నూతన సాంకేతిక పద్ధతులతో వ్యవసాయం చేయాలి: కలెక్టర్

image

రఘునాథపల్లి మండలంలోని నిడిగొండలో కేంద్రీయ పత్తి పరిశోధన సంస్థ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కిసాన్ మేళా, వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు నూతన సాంకేతిక పద్ధతులతో వ్యవసాయం చేయాలని అన్నారు.

Similar News

News February 6, 2025

జగిత్యాల మార్కెట్లో నేటి ధరలు ఇలా

image

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో నేటి దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. కందులు క్వింటాల్ కనిష్ఠ ధర రూ.4,050, గరిష్ఠ ధర రూ.6,418గా నమోదయ్యింది. అనుములు క్వింటాల్ కనిష్ఠ ధర రూ.4,095, గరిష్ఠ ధర రూ.7,955గా ఉంది. మక్కలు ధర రూ.2,222గా ఉంది. ధాన్యం (1010) ధర రూ.1,655గా ఉండగా, ధాన్యం (JSR) ధర రూ.2,653గా ఉంది. ఈ వివరాలను మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు.

News February 6, 2025

US నుంచి భారత్‌కు ఫ్లైట్.. ఏ రాష్ట్రం వారు ఎందరున్నారంటే?

image

మన దేశానికి చెందిన కొందరిని US అక్రమ వలసదారులుగా గుర్తించి సైనిక విమానంలో తిరిగి పంపిన విషయం తెలిసిందే. టెక్సాస్ నుంచి పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు ఈ మధ్యాహ్నం విమానం రాగా అందులో 104 మంది భారతీయులున్నారు. వారిలో 30మంది పంజాబ్, 33మంది హరియాణా, 33మంది గుజరాత్ వాసులున్నారు. వీరితో పాటు MHకు చెందిన ముగ్గురు, UPకి చెందిన ముగ్గురు, చంఢీగఢ్‌ వాసులు ఇద్దరు ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

News February 6, 2025

రూ.80.15 కోట్ల లక్ష్యంతో స్వయం ఉపాధి: కలెక్టర్

image

జిల్లాలో వివిధ కార్పొరేషన్ల ద్వారా మొత్తం 4998 యూనిట్లకు రూ.80.15 కోట్ల లక్ష్యంతో స్వయం ఉపాధి అవకాశాలను అందించనున్నట్లు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. బుధవారం కడప కలెక్టరేట్లో వివిధ కార్పొరేషన్ల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు స్వయం ఉపాధి, రుణ సహాయ సంక్షేమ పథకాల అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. స్వయం ఉపాధి అవకాశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

error: Content is protected !!