News October 11, 2025
జనగామ: నేడు కలెక్టరేట్లో పీఎండీడీకేవై పథకం ప్రారంభోత్సవం

జనగామ కలెక్టరేట్లో ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని శనివారం ప్రారంభించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం కలెక్టరేట్లోని వీసీ హాల్లో ప్రారంభ ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, యశస్విని రెడ్డిలు హాజరు కానున్నారు.
Similar News
News October 11, 2025
కొలువు తీరిన దుర్గగుడి పాలకమండలి సభ్యులు

ఇంద్రకీలాద్రి దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకారం శనివారం జరిగింది. మొత్తం 17 మంది సభ్యులతో ఏర్పాటైన పాలకమండలి సభ్యుల చేత రాజగోపురం ముందు ఈవో శీనా నాయక్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సభ్యుల్లో బీజేపీ నుంచి ఇద్దరు, జనసేన నుంచి ఒకరు, మిగిలిన 14 మంది టీడీపీ నుంచి ప్రమాణ స్వీకారం చేశారు. దుర్గగుడి అభివృద్ధి కోసం అందరూ కృషి చేస్తామని పాలకమండలి సభ్యులు తెలిపారు.
News October 11, 2025
గ్రేటర్ HYDలో 14,112 గుంతలు పూడ్చి వేసినట్లు ప్రకటన

గ్రేటర్ HYD వ్యాప్తంగా 16,541 గుంతలు ఉన్నాయని గుర్తించిన అధికారులు, ఇప్పటి వరకు రోడ్లపై 14,112 గుంతలు పూడ్చివేసినట్లుగా తెలిపారు. రోడ్డు సేఫ్టీ చర్యలు వేగంగా చేపడుతున్నట్లు GHMC వివరించింది. జోన్ల వారీగా ఎల్.బీ. నగర్ జోన్ 2,743, చార్మినార్ జోన్ 2,235, ఖైరతాబాద్ 1,987, శేరిలింగంపల్లి 1,576, కూకట్‌పల్లి 2,308, సికింద్రాబాద్ జోన్‌లో 3,263 గుంతలు పూడ్చినట్లు రిపోర్ట్‌ను విడుదల చేసింది.
News October 11, 2025
BREAKING: మూసాపేట్‌లో MURDER

HYD కూకట్‌పల్లి PS పరిధి మూసాపేట్‌లో అర్ధరాత్రి జరిగిన ఘర్షణ ఒకరి ప్రాణం తీసింది. స్థానిక వైన్‌షాప్ వద్ద మద్యం తాగిన ఇద్దరు సెంట్రింగ్ కార్మికుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో మహమూద్ అనే వ్యక్తి దామోదర్‌పై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన దామోదర్ అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.