News October 25, 2025
జనగామ: నేడు పత్తి రైతుల రాష్ట్ర సదస్సు

జనగామలోని పూసల భవన్లో నేడు ఉదయం 10గంటలకు పత్తి రైతుల రాష్ట్ర సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ముఖ్య అతిధులుగా ఏఐకేఎస్ కేంద్ర కమిటీ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, పత్తి రైతుల సంఘం రాష్ట్ర కో కన్వీనర్ శోభన్ హాజరు కానున్నారు. పత్తి రైతుల సమస్యలపై, పత్తి రైతుల కల్పించాల్సిన మద్దతు ధరపై ప్రసంగించనున్నారు.
Similar News
News October 25, 2025
జిల్లా సర్వజన ఆసుపత్రిలో ఉచిత OP సేవలు: MP

ప్రజల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ జిల్లా సర్వజనాసుపత్రిలో వైద్యసేవల్ని మరింత విస్త్రృతం చేస్తున్నామని ఏలూరు MP పుట్టా మహేష్ కుమార్ చెప్పారు. శనివారం జిల్లా సర్వజనాసుపత్రిలో విజయవాడకు చెందిన ఓ న్యూరో & కార్డియాక్ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత OP వైద్యసేవలను ఆయన ప్రారంభించారు. ఇకపై ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఉచిత OP సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.
News October 25, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

* ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ నేతలతో కీలక భేటీ
* మద్యం దుకాణాల టెండర్లపై హైకోర్టు తీర్పు రిజర్వ్
* త్వరలోనే 14,000 అంగన్‌వాడీ హెల్పర్ల నియామకం
* కర్నూల్ బస్సు ప్రమాదం నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రైవేటు బస్సుల్లో ముమ్మర తనిఖీలు
* హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో కొనసాగుతున్న వర్షాలు
News October 25, 2025
ఆ ఆసుపత్రులకు నోటీసులివ్వండి: కలెక్టర్

లక్ష్య సాధనలో అలసత్వం వద్దని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలెక్టర్ శనివారం సమీక్ష నిర్వహించారు. గర్భిణీ స్త్రీల నమోదు మెరుగుపడాలని, ఏ.బి.హెచ్.ఏ పై అవగాహన కల్పించాలని, గ్రామ సచివాలయం సిబ్బందిని ఉపయోగించాలన్నారు. శత శాతం సిజేరియన్ ప్రసవాలు చేస్తున్న ఆసుపత్రులకు నోటీసులు జారీ చేయాలని, పక్కాగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.


