News March 20, 2025

జనగామ: నేడు ప్రారంభం కానున్న పండ్ల మార్కెట్

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని ముసలమ్మకుంట గోదాముల వద్ద ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్‌ను గురువారం మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే కేఆర్. నాగరాజు ప్రారంభిస్తారని మార్కెట్ కార్యదర్శి గుగులోతు రెడ్యా తెలిపారు. ఈ మేరకు మామిడికాయల సీజన్ ప్రారంభమైనందున ముసలమ్మకుంటలో పండ్ల మార్కెట్ ఏర్పాటు చేసేందుకు మార్కెటింగ్ శాఖ అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేయిస్తున్నారు.

Similar News

News September 18, 2025

పెద్దపల్లి టాస్క్‌లో రేపు జాబ్‌ మేళా

image

పెద్దపల్లిలోని పాత MPDO కార్యాలయం దగ్గర గల TASK రీజినల్ సెంటర్ లో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు TASK ప్రతినిధులు తెలిపారు. టెలి పెర్ఫార్మెన్స్ కంపెనీలో ఉద్యోగం కోసం ఆసక్తి గల నిరుద్యోగులు ఉ. 10గంటల వరకు తమ రెజ్యూమ్ కాపీలు, ఐడీ ప్రూఫ్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు తప్పనిసరిగా తీసుకొని రావలసి ఉంటుందన్నారు. B.Tech/డిగ్రీ/డిప్లొమా చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. వివరాలకు 9059506807 సంప్రదించవచ్చు.

News September 18, 2025

VKB: ‘బియ్యాన్ని సమయానికి అందించాలి’

image

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు అందించే బియ్యాన్ని సమయానికి అందించాలని రైస్ మిల్లర్లకు అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ జిల్లాలోని రైస్ మిల్లర్లతో సివిల్ సప్లై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైస్ మిల్లర్లకు నిర్దేశించిన రైస్‌ను సకాలంలో అందిస్తే జిల్లాలోని రేషన్ షాపులకు త్వరగా పంపిణీ చేస్తామన్నారు.

News September 18, 2025

పార్వతీపురం: ‘స్వచ్ఛందంగానే బంగారు కుటుంబాల దత్తత’

image

స్వచ్ఛందంగానే బంగారు కుటుంబాల దత్తత ఉంటుందని, మార్గదర్శి నిర్ణయమే ముఖ్యమని జాయింట్ కలెక్టర్ సి. యస్వంత్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్ పి-4 బంగారు కుటుంబాల శిక్షణా తరగతులపై సమావేశం ఏర్పాటు చేశారు. బంగారు కుటుంబాల దత్తతకు మార్గదర్శకులు ముందుకు రావాలని కోరారు. ఇందులో ఎటువంటి ఒత్తిడి లేదని వారు స్వచ్ఛందంగా, ఇష్టపూర్వకంగానే రావచ్చని పేర్కొన్నారు.