News March 9, 2025
జనగామ: పదో తరగతి పరీక్షలకు 41 పరీక్ష కేంద్రాలు

ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు జనగామ జిల్లాలో 41 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. జనగామ జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లోని అన్ని వసతులున్న పాఠశాలలను కేంద్రాలుగా గుర్తించారు. మరో 11 రోజుల్లో పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయా కేంద్రాల్లో అవసరమగు ఏర్పాట్లూ ముమ్మరం చేశారు.
Similar News
News November 6, 2025
ఓ వైపు చిరుతలు, మరో వైపు ఏనుగులు.. పవన్ దారెటు.!

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తరచూ <<18213730>>చిరుతలు<<>>, ఏనుగుల భయం ప్రజలను వెంటాడుతోంది. అటవీ సమీప ప్రాంతాల్లో చిరుతలు బయటకు వచ్చి పశువులపై దాడి చేస్తున్న ఘటనలు అధికం అవుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో <<18203282>>ఏనుగులు<<>> తిష్టవేసి పంట పొలాలను ధ్వంసం చేస్తూ ప్రాణ నష్టమూ కలిగిస్తున్నాయి. మరో రెండు రోజుల్లో అటవీ శాఖ మంత్రి పవన్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
News November 6, 2025
హనుమకొండ: 9న నిరుద్యోగులకు ఉద్యోగ మేళా

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ విద్యార్థుల కోసం ఈ నెల 9న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సమగ్ర శిక్ష (SSA) ప్రకటించింది. ఈ మేళా హనుమకొండలోని ప్రాక్టీసింగ్ హైస్కూల్‌లో జరగనున్నట్లు పేర్కొంది. వృత్తి విద్యా కోర్సులు (IT&ITES, M&E, అగ్రికల్చర్, బ్యాంకింగ్ తదితర) పూర్తి చేసిన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ముఖ్య ఉద్దేశమని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News November 6, 2025
‘అవిశ’ పశువులకు పోషకాలతో కూడిన మేత

అవిశ ఆకులు పశువులకు ముఖ్యంగా పాలిచ్చే వాటికి, మేకలకు అద్భుతమైన ఆహారమని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. అవిశ ఆకుల్లో 25-30 శాతం ప్రొటీన్లు ఉంటాయి. పశువులకు సులభంగా జీర్ణమయ్యే మేత ఇది. పశువులు అవిశ ఆకులను చాలా ఇష్టంగా తిని అధిక పాల దిగుబడినిస్తాయి. అవిశ పిండి(అవిశ గింజల నుంచి నూనె తీసిన తర్వాత మిగిలిన పదార్థం)ని కూడా పశువులకు మేతగా ఉపయోగించవచ్చు. దీనిలో ప్రొటీన్లు, పోషకాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి.


