News March 21, 2025
జనగామ: పదో తరగతి విద్యార్థులకు ‘విజయోస్తు’

రేపు పదో తరగతి వార్షిక పరీక్షలు రాయబోతున్న జనగామ జిల్లాలోని పదో తరగతి విద్యార్థులకు జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ‘విజయోస్తు’ అని గురువారం ఒక ప్రకటనలో ఆశీర్వదించారు. ప్రశాంత మనసుతో పరీక్షను ఎదుర్కోవాలని, చక్కగా రాసి మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు, జిల్లాకు మంచి పేరు తేవాలని పేర్కొన్నారు. ఈ ఏడాది రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో జిల్లాను నిలబెట్టాలని కోరారు.
Similar News
News December 15, 2025
VZM: ‘చిన్న పత్రికలకు చేయూత ఇవ్వాలి’

చిన్న, మధ్య తరహా పత్రికలకు మద్దతు ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టర్ రాం సుందర్ రెడ్డికి విలేకరుల బృందం సోమవారం వినతిపత్రం ఇచ్చారు. అక్రిడిటేషన్ సంఖ్య పెంపునకు ఇతర జిల్లాల నుంచి ప్రచురితమవుతున్న విజయనగరం జిల్లాలో పనిచేస్తున్న విలేకరులకు అక్రిడిటేషన్ మంజూరు చేయాలన్నారు. క్యాలెండర్ ప్రకటనల ద్వారా ఆర్థిక భరోసా కల్పించాలనే అంశాలను వినతిలో ప్రస్తావించారు.
News December 15, 2025
ANU: LLB రెగ్యులర్ పరీక్ష ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో గత సెప్టెంబర్ నెలలో జరిగిన LLB రెగ్యులర్ పరీక్ష ఫలితాలను వర్సిటీ పరీక్షలు నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు సోమవారం విడుదల చేశారు. 1, 3 సంవత్సరాల రెండవ సెమిస్టర్, 3, 5 సంవత్సరాల ఆరో సెమిస్టర్ ఫలితాలను విడుదల చేశారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ ను సంప్రదించాలన్నారు.
News December 15, 2025
మద్యం దుకాణాలను మూసివేయాలి: ఆదర్శ్ సురభి

వనపర్తి జిల్లాలో ఈనెల 17న 3వ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఆయా మండలాల్లో 5PM తర్వాత ఎటువంటి ప్రచారం నిర్వహించడానికి అనుమతి లేదని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు.పానగల్, వీపనగండ్ల, శ్రీరంగాపూర్, చిన్నంబావి, పెబ్బేర్ మండలాలలో నిషేధాజ్ఞలు 5గంటల నుంచి అమలులోకి వస్తాయన్నారు. అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.


