News February 9, 2026
జనగామ: పదో తరగతి విద్యార్థులకు కలెక్టర్ విజయోస్తు 2.0 లేఖ

జనగామ జిల్లాలోని పదో తరగతి విద్యార్థులకు కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ‘ విజయోస్తు 2.0 ‘ లేఖను అందజేస్తున్నారు. గతేడాది కూడా ఇదే తరహాలో ‘ విజయోస్తు ‘ లేఖలను అందించిన కలెక్టర్ పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో మూడో స్థానంలో నిలిచేలా కృషి చేశారు. ఈ ఏడాది మొదటి స్థానమే లక్ష్యంగా కలెక్టర్ విజయోస్తు 2.0 కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం జిల్లాలోని విజయవంతంగా కొనసాగుతోంది.
Similar News
News February 22, 2026
కామారెడ్డిలో వార్.. ముగింపు కార్డు పడనుందా?

సవాళ్లు, ప్రతి సవాళ్లతో కామారెడ్డి రణరంగంగా మారింది. అభివృద్ధి విషయంలో పోరాడాల్సిన వారే ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ యుద్ధం ప్రారంభమైంది. సోమవారం కలెక్టర్ కార్యాలయానికి ఇరు పార్టీల అధినేతలు వెళ్లి సంబంధిత అంశాలపై చర్చించి నిజానిజాలు తేల్చుకుంటారా! ఈ అంశాలపై ముగింపు కార్డు వేస్తారా! అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా మున్సిపల్ ఎన్నికల్లో హామీలిచ్చిన నేతలు అభివృద్ధిలో మమేకం కావాలంటున్నారు.
News February 22, 2026
MDK: ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు: MP

ప్రజాస్వామ్యంలో హింసకు ఎలాంటి స్థానం లేదని అభిప్రాయ భేదాలు ఉంటే చట్టబద్ధమైన, శాంతియుత మార్గాల్లో వ్యక్తపరచాలని MP రఘునందన్ రావు పేర్కొన్నారు. కామారెడ్డి MLA కాటిపల్లి వెంకటరమణారెడ్డి కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్య విలువలను దెబ్బతిస్తాయని, ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
News February 22, 2026
GNT: కాంగ్రెస్ తీరుపై అంబటి తీవ్ర విమర్శలు

YSR మరణం తర్వాత ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వేధించిందని అంబటి రాంబాబు విమర్శించారు. రాజకీయ కక్షతోనే జగన్‌పై CBI, EDఅక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. అలాంటి కాంగ్రెస్ ఇప్పుడు YSRవారసత్వం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. జాతీయ ప్రయోజనాల విషయంలో తామెప్పుడూ రాజీపడలేదన్నారు. విదేశీ గడ్డపై దేశ పరువు తీయడం సరికాదని హితవు పలికారు. చంద్రబాబుతో కాంగ్రెస్ చీకటి ఒప్పందాలు అందరికీ తెలుసన్నారు.


