News March 5, 2025
జనగామ: పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

మే 4న జరగనున్న జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్-2025 పరీక్ష నిర్వహణకు పరీక్ష కేంద్రాల ఎంపిక కోసం మంగళవారం జిల్లా కేంద్రంలోని గీతాంజలి పబ్లిక్ పాఠశాల, సెయింట్ మేరీస్ పాఠశాల, క్రీస్తుజ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలను డీసీపీ రాజ మహేంద్ర నాయక్, ఏఎస్పీ పండరి చేతన్ నితిన్‌తో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించి పరిశీలించారు. కాగా జిల్లా నుంచి విద్యార్థులు ఈ నీట్ రాయనున్నట్లు తెలిపారు.
Similar News
News July 6, 2025
సిగాచీ ప్రమాదం.. 41కి చేరిన మృతుల సంఖ్య

TG: పాశమైలారం సిగాచీ ఫార్మా ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా జితేందర్ అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. దీంతో మృతుల సంఖ్య 41కి చేరింది. మరో 11 మంది ఆచూకీ లభించలేదు. మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
News July 6, 2025
KMR: UPSC సివిల్స్‌కు ఉచిత కోచింగ్.. దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సివిల్స్‌కు ఉచిత లాంగ్ టర్మ్ (ప్రిలిమ్స్-కమ్-మెయిన్స్) కోచింగ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కామారెడ్డి జిల్లా వెనుకబడిన తరగతుల అధికారిని స్రవంతి తెలిపారు. www.tgbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్‌లో జూలై 8 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 08462-241055కు సంప్రదించాలని ఆమె కోరారు.
News July 6, 2025
ములుగు జిల్లాలో 36.00 మి.మీ వర్షపాతం

ములుగు జిల్లాలో ఆదివారం ఉదయం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటాపూర్ 12.2, ములుగు 4.4, గోవిందరావుపేట 9.8, తాడ్వాయి 2.6, వాజేడు 1.6, వెంకటాపురం 1.2, మంగపేటలో 4.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు. జిల్లా వ్యాప్తంగా 36.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, సగటు వర్షపాతం 4.2గా ఉంది.