News September 21, 2024
జనగామ: పీఆర్ పెండింగ్ పనులను పూర్తిచేయాలి: కలెక్టర్
పంచాయతీరాజ్ శాఖలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను అక్టోబర్ 15 కల్లా పూర్తి చేయాలని జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాష ఆదేశించారు. జనగామ కలెక్టరేట్లో స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు ఇంజనీరింగ్ అధికారులతో శనివారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గత రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన పెండింగ్ పనులు పూర్తి చేయాలని అన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించాలన్నారు.
Similar News
News November 25, 2024
KU డిగ్రీ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ పరీక్షలు వాయిదా పడ్డాయి. బీఏ, బీకాం, బీబీఏ, బీఏసీ తదితర కోర్సుల మొదటి, ఐదో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 26న ఉండగా వాటిని డిసెంబర్ 27కు రీ షెడ్యూల్ చేశారు. మూడో సెమిస్టర్ ఈ నెల 27న ఉండగా డిసెంబర్ 28కి మార్చారు. నవంబర్ 28న ఉండే పరీక్షను డిసెంబర్ 30న నిర్వహించనున్నట్లు కేయూ అధికారులు తెలిపారు. మిగతావి యథావిధిగా కొనసాగుతాయన్నారు.
News November 25, 2024
నర్సంపేట: 29న పారా మెడికల్ కోర్సులకు ఇంటర్వ్యూలు
నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధంగా ఈ ఏడాది ప్రారంభం కానున్న పారా మెడికల్ కళాశాలలో వివిధ కోర్సుల ప్రవేశానికి ఈ నెల 29న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ తెలిపారు. నర్సంపేట ప్రభుత్వ పారామెడికల్ కళాశాలలో D.ECG, D.Dialysis కోర్సులు ఉన్నట్లు తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం, అభ్యర్థి ధ్రువీకరణ పత్రాలతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు.
News November 25, 2024
MHBD: మొదటి జీతం అందుకోకుండానే టీచర్ మృతి
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కల సాకారం చేసుకొని మొదటి జీతం అందుకోకుండానే రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడిని మృత్యువు కబళించింది. MHBD జిల్లా గంగారం మండలం బావురుగొండ టీచర్ ఉపేందర్ (45) పాఠశాలకు వెళ్తున్న క్రమంలో లారీ ఢీకొని మృతి చెందారు. బయ్యారం మండలానికి చెందిన ఉపేందర్ ఇటీవల ఎస్జీటీ ఉద్యోగం సాధించారు. ఉపేందర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.