News September 10, 2025

జనగామ పురపాలక సంఘం కార్యాలయంలో ఐలమ్మ వర్ధంతి

image

జనగామ పురపాలక సంఘ కార్యాలయంలో కమిషనర్ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి కమిషనర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కమిషనర్ మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ భూ పోరాటంలో వెట్టి చాకిరి, విముక్తి కోసం దొరలను గడగడలాడించిన వీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. మున్సిపల్ అధికారులు రాములు, గోపయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Similar News

News September 10, 2025

NTR: పీజీ పరీక్షల రీవాల్యుయెషన్ ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జనవరి 2025లో నిర్వహించిన ఎం.కామ్ 1, 3వ, ఎం.ఏ. రాజనీతి శాస్త్రం, చరిత్ర, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 1వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల రీవాల్యుయెషన్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఫలితాలకై https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని ANU పరీక్షల విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది.

News September 10, 2025

వేములవాడ: ఇంటిపై పిడుగు.. ఉలిక్కి పడ్డ జనం

image

వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్‌లో అకస్మాత్తుగా చిన్నపాటి వర్షంతో పిడుగు పాటు చోటుచేసుకుంది. పిడుగు ఓ ఇంటిపై పడటంతో ఇంట్లో ఉన్న టెలివిజన్, ఫ్రిజ్, ఫ్యాన్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు దెబ్బతిన్నాయి. ఇంటి పై భాగంలోని గోడకు పిడుగు తగలడంతో కొంత భాగం కూలిపోయింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే, ఇంట్లో ఉన్న వారికి ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడం ఊరట కలిగించింది.

News September 10, 2025

GNT: పీజీ పరీక్షల రీవాల్యుయెషన్ ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జనవరి 2025లో నిర్వహించిన M.com 1, 3వ, MA. రాజనీతి శాస్త్రం, చరిత్ర, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 1వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల రీవాల్యుయెషన్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఫలితాలకై https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని ANU పరీక్షల విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది.