News February 7, 2026
జనగామ: పులి కనిపిస్తే ఫొటోలు తీయొద్దు!

జిల్లాలో పులి సంచరిస్తున్నందున ఎవరికైనా పులి కనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఫొటోలు గానీ, పులిని రెచ్చగొట్టేలా కవ్వింపు చర్యలు చేయొద్దని అటవీ శాఖ అధికారి కొండల్ రెడ్డి సూచించారు. పులి కనిపిస్తే స్థానిక పోలీస్ స్టేషన్ సమాచారం ఇవ్వాలని సూచించారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలనుకుంటే 9603780678, 7382619411, 8121316323 నంబర్లను సంప్రదించాలని కోరారు.
Similar News
News February 20, 2026
ఖమ్మం: భట్టికి రూ.4.50 కోట్లతో కొత్త క్యాంప్ ఆఫీస్!

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రూ.4.50 కోట్లతో కొత్త క్యాంప్ ఆఫీస్ నిర్మించనున్నారు. ఖమ్మం పట్టణంలో డిప్యూటీ సీఎం కోసం ఈ క్యాంప్ ఆఫీస్ నిర్మించనున్నారు. భట్టికి ఇది రెండో క్యాంప్ ఆఫీస్ కానుంది. ప్రస్తుతం భట్టి ప్రగతి భవన్‌ను క్యాంప్ ఆఫీస్, నివాసంగా ఉపయోగిస్తున్నారు. అవసరమైన నిధులు, పరిపాలన అనుమతి ప్రభుత్వం ఇచ్చినందున రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ క్యాంప్ ఆఫీస్ నిర్మాణాన్ని చేపట్టనుంది.
News February 20, 2026
కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం

AP: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏక సభ్య కమిషన్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ దినేశ్ కుమార్‌ను నియమించింది. ఈ కమిషన్ టీటీడీలో పరిపాలనా లోపాలు, టెండర్లపై సమగ్ర పరిశీలన చేయనుంది. 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిషన్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
News February 20, 2026
ఖానాపూర్‌లో 10వ శతాబ్దపు విగ్రహాలు లభ్యం..!

ఖానాపూర్ మండలంలోని బీర్నంది – కొమ్ము తాండా మధ్య అటవీ ప్రాంతంలో క్రీ.శ.10వ శతాబ్దానికి చెందిన విగ్రహాలను గుర్తించినట్లు చరిత్ర పరిశోధకులు రాజ్ కుమార్ తెలిపారు. చాళుక్యుల శైలిలో ఉన్న ద్విభుజ గణపతి, రాతిపై మలచిన భక్తాంజనేయ స్వామి, అరుదైన నాగబంధం, అలంకరణ స్తంభం ఇక్కడ లభ్యమయ్యాయి. ఒకప్పుడు ఇక్కడ ‘భీమన్న గుడి’ ప్రాంగణం ఉండేదని ఆయన పేర్కొన్నారు. ఈ చారిత్రక సంపద స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటోంది.


