News October 9, 2025
జనగామ: పొగాకుకు నో చెప్పాలి: డీఎంహెచ్వో

జనగామ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.కె.మల్లిఖార్జున రావు జనగామ GGHలోని NCD క్లినిక్‌ను సందర్శించి పలు రికార్డులు పరిశీలించారు. అనంతరం “పొగాకు రహిత యువతా ప్రచారం” అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. పొగాకు వినియోగం ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, ప్రజలంతా పొగాకు పదార్థాలకు నో చెప్పాలని పిలుపునిచ్చారు. జిల్లాలో 400 పాఠశాలలు, 30 గ్రామాలను పొగాకు రహితంగా మార్చే లక్ష్యం ఉందన్నారు.
Similar News
News October 9, 2025
శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ బదిలీ

సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను ఆంధ్రప్రదేశ్ మెరిటైమ్ బోర్డు సీఈఓగా నియమించారు. అదనంగా ఏపీ మెరిటైమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు కూడా ఆయనకు అప్పగించారు.
News October 9, 2025
కోస్గి: ‘కోర్టు తీర్పు నిరాశ కలిగించింది’

బీసీ రిజర్వేషన్లపై కోర్టు తీర్పు బాధ కలిగించిందని ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. బీసీ కులాలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రిజర్వేషన్లు ఊరించి ఉసూరుమనిపించాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు అగ్రవర్ణాల వారు బీసీలపై కక్ష కట్టి కేసు వేయడం హేయమైన చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు.
News October 9, 2025
ట్రంప్‌కు మోదీ శుభాకాంక్షలు

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. గాజా శాంతి ప్రణాళిక విజయవంతమైనందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపినట్లు ట్వీట్ చేశారు. భారత్, US మధ్య ట్రేడ్ చర్చల పురోగతిపై సమీక్షించినట్లు తెలిపారు. భవిష్యత్‌లో ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగించేందుకు అంగీకరించినట్లు పేర్కొన్నారు.