News February 9, 2026

జనగామ: పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి

image

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ సిబ్బంది మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జనరల్ అబ్జర్వర్ నర్సింహా రెడ్డి సమక్షంలో నిర్వహించారు. జనగాం మున్సిపాలిటీలో 30 వార్డుల్లో 66 పోలింగ్ స్టేషన్స్‌కి 20% రిజర్వ్‌తో POలు 80 మంది, APOలు 80, OPOలు240, స్టే.ఘ.లో 18 వార్డుల్లో 36 పోలింగ్ స్టేషన్స్‌కి 20% రిజర్వ్‌తో POలు 44 మంది, APOలు 44, OPOలు 132 మందిని నియమించారు.

Similar News

News February 15, 2026

శివాలయాల్లో MP పార్థసారథి పూజలు

image

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని హిందూపురం ఎంపీ BK పార్థసారథి పెనుగొండలోని పలు శివాలయాలను దర్శించుకున్నారు. పట్టణంలోని ముక్తేశ్వరాలయం, నాగేశ్వరాలయం, కాశీ విశ్వేశ్వర ఆలయాలతో పాటు భోగసముద్రంలోని యోగేశ్వర స్వామి దేవస్థానంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు సాయి కళ్యాణ్, శశిభూషణ్ పటేల్, గాడి మల్లికార్జున యాదవ్ తదితర టీడీపీ నేతలు పాల్గొన్నారు.

News February 15, 2026

కరీంనగర్: రేపు ప్రజావాణి రద్దు

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం రద్దు చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న దృష్ట్యా ఎన్నికల నియమావళి అమలులో ఉన్నట్లు పేర్కొన్నారు. అధికారులంతా ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణిని సోమవారం నిర్వహించలేమని చెప్పారు.

News February 15, 2026

ఛాంపియన్‌గా కర్నూలు జిల్లా జట్టు

image

రెండు రోజులుగా కర్నూలు అవుట్‌డోర్ స్టేడియంలో జరుగుతున్న 3వ రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ హాజరై గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. కర్నూలు జట్టు మొదటి స్థానం, కృష్ణాజిల్లా జట్టు రెండవ స్థానం, గుంటూరు జట్టు మూడో స్థానంలో నిలిచింది.