News February 26, 2025
జనగామ: పోలీస్ ఎస్కార్ట్‌తో పరీక్ష పేపర్లను తరలించాలి: కలెక్టర్

జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కలెక్టర్ రిజ్వాన్ బషా షేక్ 10వ తరగతి పరీక్షలపై సమావేశం నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలని, విద్యార్థులకు తాగునీరు, మూత్రశాలల సౌకర్యం వంటి అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పోలీస్ ఎస్కార్ట్‌తో ప్రభుత్వ వాహనంలో పరీక్ష పేపర్లను తరలించాలని అధికారులకు సూచించారు.
Similar News
News December 17, 2025
సిద్దిపేట జిల్లాలో 86.74 శాతం పోలింగ్

సిద్దిపేట జిల్లాలో పోలింగ్ ఉత్సాహంగా సాగుతోంది. మధ్యాహ్నం 1 గంట సమయానికి జిల్లావ్యాప్తంగా సగటున 86.74 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మండలాల వారీగా కుకునూరుపల్లిలో అత్యధికంగా 90.88%, ధూల్మిట్టలో 89.34% ఓటింగ్ జరగ్గా.. చేర్యాలలో అత్యల్పంగా 81.99% నమోదైంది. మిగిలిన మండలాల్లోనూ ఓటర్లు భారీగా తరలివచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంటకే గడువు ముగియడంతో ఓటర్లందరూ క్యూలైన్లలో బారులు తీరారు.
News December 17, 2025
కరీంనగర్: పోలింగ్ ముగిసింది.. కౌంట్ డౌన్ షురూ

పల్లె పోరు తుది దశకు చేరింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 388 GPలకు జరిగిన మూడవ విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కరీంనగర్ 84.35%, పెద్దపల్లి జిల్లా 82.34%, జగిత్యాల77.83%, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 76.39% ఓట్లు పోలయ్యాయి. రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండగా అధికారులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.
News December 17, 2025
మఠంపల్లి: 102 ఏళ్ల వయసులోనూ ఓటేసిన అవ్వ..!

మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తికి అద్భుత ఉదాహరణగా నిలిచారు ఓ అవ్వ. మఠంపల్లి మండల పరిధిలోని కింది తండా గ్రామ పంచాయతీకి చెందిన 102 సంవత్సరాల వృద్ధురాలు వయసు మీద పడినప్పటికీ శారీరక ఇబ్బందులను లెక్కచేయకుండా తన ఓటు హక్కును వినియోగించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. చేతి కర్ర సహాయంతో నడుచుకుంటూ కుటుంబ సభ్యుల తోడుతో పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు హక్కును వినియోగించుకున్నారు.


