News August 17, 2025

జనగామ: ప్రకృతి గీసిన చిత్రం, క్యాప్చర్ చేసిన గౌడన్న

image

భూమిపై రైతుల కష్టంతో ఏర్పడిన పచ్చని పొలాలు, వాటిపై తాటి చెట్టు నీడ, ఇది ప్రకృతి గీసిన అందమైన చిత్రం. ఈ చిత్రం జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం మీదికొండలో కనిపించింది. ఎర్రని సూర్యుడుని అడ్డుకున్న తాటి చెట్టు నీడ, పచ్చని పొలాలపై పడి ఆకర్షించింది. కాగా, ఆ చెట్టుపై ఉన్న గౌడన్న శివకుమార్ చిత్రీకరించిన ఈ ఫొటోను Way2News సేకరించింది.

Similar News

News August 17, 2025

సంగారెడ్డి: 20 నుంచి మండల స్థాయి పోటీలు: డీఈఓ

image

సంగారెడ్డి జిల్లాలో ఈనెల 20 నుంచి పది రోజుల పాటు మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ పోటీల్లో ఖోఖో, వాలీబాల్, కబడ్డీ మాత్రమే ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ క్రీడా పోటీల కోసం విద్యార్థులను సిద్ధం చేయాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచించారు.

News August 17, 2025

గుడ్లూరులో గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

గుడ్లూరు మండలం చేవూరు గ్రామ పరిధిలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. రామదూత ఆశ్రమం ఎదురుగా ఉన్న శేషమ్మ సత్రం వద్ద నేల బావిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బావిలో ఉన్న మృతదేహాన్ని బయటకి తీశారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు గుడ్లూరు పోలీసు స్టేషన్ లేదా 91211 02206 నంబరుకు సంప్రదించాలని పోలీసులు కోరారు.

News August 17, 2025

భద్రాద్రి: నేడు మంత్రి పొంగులేటి పర్యటన

image

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం నుంచి ఖమ్మంలో జిల్లాలో మొదలయ్యే మంత్రి పర్యటన కూసుమంచి, నేలకొండపల్లి మండలాలతో పాటు ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మంలో కొనసాగుతుంది. ఆ తర్వాత నుంచి సాయంత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు, లక్ష్మిదేవిపల్లి మండలు, కొత్తగూడెం కార్పొరేషన్లలో జరిగేపలు ప్రైవేట్ కార్యక్రమాలకు మంత్రి హాజరవుతారు.