News September 25, 2025
జనగామ: ప్రజాపాలన దరఖాస్తుల వివరాల సర్దుబాటు..!

జిల్లాలోనీ మండల పరిషత్, మున్సిపాలిటీ, కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాలకు వచ్చిన 15,954 దరఖాస్తుల వివరాలను సరిచేసినట్లు కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు. జిల్లాలోని 14 ప్రజాపాలన కేంద్రాల ద్వారా ప్రజా పాలనలో చేసుకున్న దరఖాస్తుల్లో తప్పులు ఉన్న వాటిని సవరించినట్లు పేర్కొన్నారు.
Similar News
News September 25, 2025
డీజీపీ రేసులో ఆ ఇద్దరు?

TG: డీజీపీ జితేందర్ ఈ నెలాఖరులో రిటైర్ కానుండగా ఆయన స్థానంలో శివధర్ రెడ్డి, సీపీ ఆనంద్ రేసులో ఉన్నట్లు సమాచారం. శివధర్ రెడ్డి ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉండగా, ఆనంద్ HYD సీపీగా కొనసాగుతున్నారు. అయితే మరో 7 నెలల్లో రిటైర్ కానున్న శివధర్ వైపే ప్రభుత్వం మొగ్గు చూపుతుందని డిపార్ట్‌మెంట్‌లో చర్చ జరుగుతోంది. అదే జరిగితే ఆనంద్‌ను విజిలెన్స్, ఏసీబీ చీఫ్‌గా నియమించే అవకాశముందని తెలుస్తోంది.
News September 25, 2025
ఆసియాకప్ నుంచి శ్రీలంక ఔట్

ఆసియాకప్ 2025లో శ్రీలంక ఇంటి బాట పట్టింది. నిన్నటి మ్యాచులో బంగ్లాదేశ్‌పై టీమ్ ఇండియా గెలవడంతో ఆ జట్టు ఆశలు గల్లంతయ్యాయి. ఇవాళ పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగే మ్యాచులో గెలిచిన జట్టు ఫైనల్ చేరనుంది. పాక్ గెలిస్తే ఈ ఎడిషన్‌లో మూడో సారి టీమ్‌ఇండియాతో తలపడనుంది. అటు రేపు జరిగే భారత్, శ్రీలంక మధ్య మ్యాచ్ నామమాత్రమే కానుంది. కాగా ఫైనల్ ఈ నెల 28న జరగనుంది.
News September 25, 2025
బాల్యవివాహం రద్దు

శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం మైలసముద్రంలో బాల్య వివాహాన్ని పోలీసులు అడ్డుకున్నారు. గ్రామంలో ఓ బాలికకు వివాహం చేయడానికి తల్లిదండ్రులు నిశ్చయించారు. బుధవారం డయల్ 100 ద్వారా సమాచారం తెలుసుకున్న కొత్తచెరువు సీఐ మారుతి శంకర్ బాలిక తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో తల్లిదండ్రులు పెళ్లి రద్దు చేసుకున్నారు. కౌన్సెలింగ్‌లో అంగన్వాడీ టీచర్లు, మహిళా పోలీస్ పాల్గొన్నారు.