News February 23, 2026
జనగామ: ప్రజావాణిలో 78 దరఖాస్తుల స్వీకరణ

జనగామ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు అందజేసిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉన్న ఆర్జీలపై జాప్యం లేకుండా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మొత్తం 78 దరఖాస్తులు ప్రజావాణిలో స్వీకరించినట్లు తెలిపారు
Similar News
News February 24, 2026
యాదాద్రి: రేపు గజవాహన సేవ, కళ్యాణోత్సవం

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. రేపు ఉదయం 9 గంటలకు స్వామివారు శ్రీరామ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి, హనుమంత వాహనంపై ఊరేగనున్నారు. అనంతరం రాత్రి 9 గంటలకు గజ వాహన సేవ, రాత్రి 9:30 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వేడుకగా జరగనున్నాయి. ఈ పవిత్ర వేడుకలకు భక్తులు భారీగా తరలిరావాలని ఆలయ అధికారులు కోరారు.
News February 24, 2026
పార్వతీపురం: ‘సార్వత్రిక ఓపెన్ స్కూల్ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు’

జిల్లాలో మార్చి 2వ తేదీ నుంచి 13 వరకు జరగనున్న 10వ తరగతి, ఇంటర్ ఓపెన్ స్కూల్ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం పార్వతీపురం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఓపెన్ స్కూల్ టెన్త్ పరీక్షలకు జిల్లాలో 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇంటర్ విద్యార్థులకు 2 కేంద్రాలను కేటాయించినట్లు పేర్కొన్నారు.
News February 24, 2026
అనకాపల్లి: 219 మంది ఇంటర్ విద్యార్థులు గైర్హాజర్

అనకాపల్లి జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభం అయినట్లు డీఐఈఓ ఎం.వినోద్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. 34 పరీక్షా కేంద్రాల్లో 12,422 మంది హాజరుకావాల్సి ఉండగా 219 మంది విద్యార్థులు గైర్హాజర్ అయినట్లు తెలిపారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్కు అవకాశం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు.


