News October 12, 2025

జనగామ: ప్రజావాణి నిర్వహణపై స్పష్టత కరవు!

image

ఎన్నికల కోడ్ నేపథ్యంలో తాత్కాలికంగా ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తూ జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ప్రకటించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు తీర్పు వాయిదా వేయడంతో ఎన్నికల సంఘం కోడ్ రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే సోమవారం కలెక్టరేట్లో జరగాల్సిన విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రజలు ఉన్నట్లా? లేనట్లా? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News October 13, 2025

CRDA ఆఫీస్ ప్రారంభానికి సర్వం సిద్ధం: నారాయణ

image

AP: అమరావతిలో CRDA ప్రధాన ఆఫీస్ ప్రారంభానికి సర్వం సిద్ధమైనట్లు మంత్రి నారాయణ తెలిపారు. రేపు 9.54AMకు CM CBN కార్యాలయాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. తదుపరి ఆయనకు ఢిల్లీ పర్యటన ఉండటంతో బహిరంగ సమావేశం ఉండదన్నారు. ఈ ఆఫీస్ ప్రారంభోత్సవానికి రైతులందరూ ఆహ్వానితులే అని వెల్లడించారు. రాజధానిలోని సీడ్ యాక్సిస్ రోడ్ E3-N11 జంక్షన్ వద్ద రాయపూడి సమీపంలో CRDA ఆఫీస్ నిర్మించిన విషయం తెలిసిందే.

News October 13, 2025

రేపు ఉదయం లోగా పలు జిల్లాల్లో వర్షాలు!

image

TG: రాష్ట్రంలో రేపు ఉదయం 8.30గంటల లోపు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.

News October 13, 2025

హామీలకు హద్దులుండవా?

image

బిహార్‌లో ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఇస్తున్న హామీలకు హద్దులు ఉండవా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాము గెలిస్తే లిక్కర్ బ్యాన్ ఎత్తేస్తామని <<17988426>>JSP<<>> తాజాగా ప్రకటించింది. చాలా రాష్ట్రాల్లో కుదరని, సదుద్దేశంతో అమలు చేస్తున్న బ్యాన్‌ను ఎత్తేస్తామనడం కరెక్టేనా అని SMలో చర్చ జరుగుతోంది. అటు తాము గెలిస్తే ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తేజస్వీ చెప్పిన విషయం తెలిసిందే. ఈ హామీలపై మీ COMMENT.