News January 20, 2026

జనగామ: ప్రధాన్ మంత్రి ధన్ ధాన్య యోజన అమలుపై సమీక్ష

image

జనగామ జిల్లాలో ప్రధాన్ మంత్రి ధన్ ధాన్య యోజన అమలుపై కేంద్ర ప్రభుత్వం నియమించిన టెక్నికల్ ఆఫీసర్ రిషికాంత్, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆధ్వర్యంలో ఐడీఓసీ కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. రైతులకు సులభతరంగా రుణ సహాయం అందించడం, ప్రత్యామ్నాయ పంటల సాగు, వ్యవసాయ రంగంలో సాంకేతికత అభివృద్ధి గురించి చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.

Similar News

News February 11, 2026

‘టాయ్‌లెట్ పేపర్ కన్నా దారుణంగా’.. అమెరికాపై పాక్ మంత్రి ఫైర్

image

అమెరికా తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం పాక్‌ను పావుగా వాడుకుంటోందని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మండిపడ్డారు. టాయ్‌లెట్ పేపర్ కన్నా దారుణంగా వాడుకుని వదిలేసిందని ఆరోపించారు. 1999 తర్వాత US మద్దతు కోసం అఫ్గాన్ యుద్ధంలోకి దిగడం తమకు తీరని నష్టం కలిగించిందని వాపోయారు. దశాబ్దాల తర్వాత కూడా పర్యవసానాలు అనుభవిస్తున్నామన్నారు. జిహాద్ పేరుతో తమ పౌరులను పోరాటానికి పంపామని పార్లమెంటులో అంగీకరించారు.

News February 11, 2026

పిఠాపురం బైపాస్ రోడ్డులో విషాదం

image

పిఠాపురం బైపాస్ రోడ్డులోని సీఐ కార్యాలయం పక్కన ఉన్న బస్ షెల్టర్ వద్ద బొబ్బిలి కృష్ణ (40) అనే వ్యక్తి మృతి చెందారు. మృతుడు పిఠాపురం మండలం రాప‌ర్తికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా ఇల్లు విడిచి బయట తిరుగుతున్న కృష్ణ, అనూహ్యంగా శవమై కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

News February 11, 2026

అసెంబ్లీలో విశాఖ, అనకాపల్లి సమస్యలపై గళం వినిపిస్తారా?

image

నేటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో విశాఖ, అనకాపల్లి MLAలు పాల్గొననున్నారు. జిల్లాల్లో నీటి సరఫరా, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ సమస్యలు, మెట్రో‌, RINL, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ సమస్యలు, పారిశ్రామిక వాడల్లో ప్రమాదాలు, జాతీయ-రాష్ట్ర రహదారుల కనెక్టివిటీ, రవాణా సౌకర్యాల లోపాలు ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. బడ్జెట్‌లో ఈ సమస్యలను తీర్చేందుకు నిధులు కేటాయించేలా మన MLAలు గళం విప్పాలని ప్రజలు కోరుతున్నారు.