News September 9, 2025
జనగామ ప్రభుత్వ ఆసుపత్రిలో వేడుకలు

జనగామ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవ వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హాజరై మాట్లాడుతూ.. అనేక రకాల వ్యాధుల నుంచి త్వరగా కోలుకునేందుకు ఫిజియోథెరపీ ఎంతగానో పనిచేస్తుందని, ప్రజలు తప్పనిసరిగా ఫిజియోథెరపిస్టుల సేవలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎం & హెచ్ఓ మల్లికార్జున్ రావు పాల్గొన్నారు.
Similar News
News September 10, 2025
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు: APSDMA

AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి, ఏలూరు, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వానలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, తీరం వెంబడి గంటకు 40 -60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.
News September 10, 2025
మోదీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నా: ట్రంప్

భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై చర్చలు కొనసాగుతున్నాయని ట్రంప్ వెల్లడించారు. ‘వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి ఇరు దేశాలు చర్చలు కొనసాగిస్తున్నాయి. రాబోయే వారాల్లో నా మంచి మిత్రుడు, ప్రధాన మంత్రి మోదీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నా. ట్రేడ్ విషయంలో రెండు గొప్ప దేశాలు సక్సెస్‌ఫుల్ కన్‌క్లూజన్‌కు రావడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదని అనుకుంటున్నా’ అని ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.
News September 10, 2025
‘ఇందిరమ్మ ఇళ్ల’ ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్

TG: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించేందుకు ప్రభుత్వం కాల్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. HYD హిమాయత్‌నగర్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ హెడ్ ఆఫీసులో ఏర్పాటు చేసిన ఈ కాల్ సెంటర్‌ను ఇవాళ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించనున్నారు. 18005995991 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా లబ్ధిదారులు, ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తారు.