News March 7, 2025
జనగామ: ప్రశాతంగా మూడో రోజు ఇంటర్ పరీక్షలు

జనగామ జిల్లాలో నేడు (శుక్రవారం) నిర్వహించిన ఇంటర్మీడియట్ జనరల్, వొకేషనల్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు 186 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ విద్య శాఖ అధికారి జితేందర్ రెడ్డి తెలిపారు. మొత్తం 4,355 విద్యార్థులకు గాను 4,169 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. డీఐఈవో, స్క్వాడ్ బృందం పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.
Similar News
News February 28, 2026
సంగారెడ్డి: ప్రతి ఫిర్యాదునూ ఆన్‌లైన్ చేయాలి: ఎస్పీ

పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేసి, బాధితులకు భరోసా కల్పించాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మంత్లీ క్రైమ్ రివ్యూ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని, ముఖ్యంగా సైబర్ మోసాలు, రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో ముమ్మరంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
News February 28, 2026
కొత్తచెరువు: హంద్రీనీవా కాలువలో కొట్టుకు వచ్చిన వృద్ధుల మృతదేహాలు

కొత్తచెరువు మండలంలో చర్ల సమీపంలో హంద్రీనీవా కాలువలో వృద్ధుల మృతదేహాలు కొట్టుకు వచ్చిన ఘటన శనివారం వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఎవరో గుర్తు తెలియని వృద్ధ దంపతులు అయ్యి ఉంటారని తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకొని వృద్ధ మృతదేహాలను గుర్తించే పనిలో పడ్డారు. ప్రమాదవశాత్తు కాలవలో పడ్డారా? లేక ఆత్మహత్య చేసుకున్నారా? అనే పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.
News February 28, 2026
BREAKING: మళ్లీ షాకిచ్చిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు మరోసారి షాకిచ్చాయి. HYD మార్కెట్‌లో ఉదయం 24 క్యారెట్ల 10గ్రా. పసిడి ధర రూ.3,160 పెరగగా తాజాగా రూ.3,980 వృద్ధిచెంది రూ.1,68,710కు చేరింది. 22క్యారెట్ల 10గ్రా. గోల్డ్ రేటు మార్నింగ్ రూ.2,900 ఎగబాకగా, ఇప్పుడు రూ.3,650 పెరిగి రూ.1,54,650గా ఉంది. KG వెండిపై ఉదయం రూ.5వేలు, ఇప్పుడు రూ.20వేలు పెరిగి రూ.3,20,000కు చేరింది. శుభకార్యాలయాల వేళ ధరల పెరుగుదల సామాన్యులను కంగారుపెడుతోంది.


