News November 29, 2025

జనగామ బీజేపీ ఇన్‌ఛార్జిగా కట్టా సుధాకర్ రెడ్డి

image

బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా ఇన్‌ఛార్జిలను నియమించింది. అందులో భాగంగా జనగామ జిల్లా ఇన్‌ఛార్జిగా కట్టా సుధాకర్ రెడ్డిని నియమించినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.గౌతమ్ రావు ప్రకటించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు ఆదేశాల మేరకు రాబోయే సంస్థాగత పనులు, పార్టీ కార్యక్రమాల దృష్ట్యా ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు.

Similar News

News December 4, 2025

పంచాయితీ చిచ్చు.. కుటుంబాలు ఛిన్నాభిన్నం

image

‘రూపాయి రూపాయి.. నువ్వు ఏం చేస్తావంటే హరిశ్చంద్రుడి చేత అబద్ధం ఆడిస్తాను అని చెప్పిందట’ ఇది ఆ నలుగురు సినిమాలోని డైలాగ్. ఇప్పుడు రాజకీయమా నువ్వు ఏం చేస్తావంటే.. <<18468452>>తల్లీకూతుళ్లు<<>>, అన్నాచెల్లెళ్లు, తండ్రీకొడుకులు, బావ బావమరుదుల మధ్య చిచ్చు పెడతానని చెబుతుంది. TG పంచాయతీ ఎన్నికల్లో కనిపిస్తోన్న దృశ్యమిది. పార్టీలు, నాయకుల పంతాలతో సామాన్య కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. ఈ ప్రమాదకర ధోరణిపై మీ కామెంట్

News December 4, 2025

పాలకోడేరు: పిల్లలను ఎత్తుకుని ముద్దాడిన కలెక్టర్

image

పాలకోడేరు మండలంలోని విస్సాకోడేరులో ఉన్న శిశు గృహ సంరక్షణ కేంద్రాన్ని కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె శిశు గృహ సంరక్షణలో ఉన్న పిల్లలను ఎత్తుకుని ముద్దాడారు. కేంద్రంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, దత్తత ప్రక్రియ ఎంతవరకు వచ్చింది తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పిల్లలను శ్రద్ధగా చూడాలని ఈ సందర్భంగా ఆమె అధికారులకు సూచించారు.

News December 4, 2025

జగిత్యాల: ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్

image

జిల్లాలలో పంచాయతీ ఎన్నికలను నిబంధన ప్రకారం నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని అన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై గురువారం ఆమె కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వార్డు సభ్యులంతా ఏకగ్రీవమైన గ్రామాలలో ఉపసర్పంచ్ నియామకం నిబంధనల ప్రకారం జరిగేల చూడాలన్నారు. కాన్ఫరెన్స్‌లో జగిత్యాల కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ తదితరులున్నారు.