News July 8, 2025
జనగామ: భర్తను కడతేర్చిన ఇద్దరు భార్యలు.!

ఇద్దరు భార్యలతో సంతోషంగా ఉండాల్సిన భర్త వారి చేతిలోనే బలైన ఘటన లింగాలగణపురం(M) ఎనబావిలోని పిట్టలోనిగూడెంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. కాలియా కనకయ్య(30)కు.. సొంత అక్కాచెళ్లెల్లు శిరీష, గౌరమ్మ అనే భార్యలు ఉన్నారు. ఇటీవల కనకయ్య అత్తను హత్య చేసి జైలుకు వెళ్లి రావడంతో భార్యలు కాపురానికి వెళ్లకుండా తల్లిగారింటిలోనే ఉంటున్నారు. మద్యం మత్తులో భార్యల వద్దకు గొడ్డలితో వచ్చిన కనకయ్యను వారు హతమార్చారు.
Similar News
News July 8, 2025
ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోవడం శోచనీయం: హరీశ్ రావు

ఉపాధి హామీ ఏపీఓలకు 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం శోచనీయమని ప్రభుత్వంపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో మనోవేదనకు గురై ఉపాధి హామీ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావడం విచారకరమన్నారు. ఉపాధి హామీ సిబ్బంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వెంటనే వేతనాలు చెల్లించాలని “X” వేదికగా డిమాండ్ చేశారు.
News July 8, 2025
అహ్మదాబాద్ విమాన ప్రమాద నివేదిక సమర్పణ

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB).. విమానయాన మంత్రిత్వ శాఖకు సమర్పించింది. బ్లాక్ బాక్స్ ఆధారంగా ప్రమాదానికి దారితీసిన కారణాలపై ఈ రిపోర్టును రూపొందించినట్లు సమాచారం. ఈ నివేదిక 4-5 పేజీలతో ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా గత నెలలో అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూలిపోయి 270 మంది మరణించిన విషయం తెలిసిందే.
News July 8, 2025
సిరిసిల్ల: ‘బాధితుల సమస్యలు పరిష్కరించడమే గ్రీవెన్స్ డే లక్ష్యం’

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి 23 ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజాసమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు.