News October 15, 2025

జనగామ: మంత్రుల వీడియో కాన్ఫరెన్స్.. పాల్గొన్న కలెక్టర్

image

ధాన్యం కొనుగోళ్లపై బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జనగామ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ రిజ్వాన్ బాషాతో పాటు అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు దిశానిర్ధేశం చేశారు.

Similar News

News October 16, 2025

MNCL: ఈ నెల 17న మినీ జాబ్ మేళా

image

నిరుద్యోగ యువతకు ఈ నెల 17న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ తెలిపారు. మెరీనా ప్లాంట్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 2190 పోస్టులకు మేళ నిర్వహిస్తున్నారు. పది, ITI, డిగ్రీ, ఎంబీఏ
చేసి 18 నుంచి 40 ఏళ్ల లోపు వారు అర్హులన్నారు. సీవీ రామన్ డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూలు ఉంటాయని వెల్లడించారు. యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

News October 16, 2025

IPS పూరన్ భార్య, బావమరిదిపై కేసు

image

IPS పూరన్ కుమార్ సూసైడ్, ఆపై ASI సందీప్ ఆత్మహత్య వ్యవహారం మరిన్ని ట్విస్టులతో సాగుతోంది. సందీప్ భార్య ఫిర్యాదుతో పూరన్ భార్య అమ్నీత్(IAS), బావ మరిది అమిత్ రట్టన్(MLA), సెక్యూరిటీ ఆఫీసర్ సుశీల్, మరో వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సందీప్ వీడియో, సూసైడ్ నోట్‌లను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఆయన ఆస్తులపైనా ఆరా తీస్తున్నారు. కేసు పెట్టే వరకు సందీప్ పోస్టుమార్టానికి ఆయన కుటుంబం అంగీకరించలేదు.

News October 16, 2025

KNR: 20 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు

image

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తెలిపారు. రాష్ట్ర DGP ఆదేశాల మేరకు విధి నిర్వహణలో ప్రాణాలను త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలను, త్యాగాలను స్మరించుకుంటూ ఈనెల 20 నుంచి 31 వరకు ‘పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల’ను ఘనంగా నిర్వహించనున్నట్లు సీపీ పేర్కొన్నారు.