News October 23, 2025

జనగామ: మద్యం టెండర్లు.. 1,600 దరఖాస్తులు!

image

మద్యం టెండర్ల గడువు నేటితో ముగియనుంది. ఈనెల 18 వరకు ఉన్న గడువును ఎక్సైజ్ శాఖ ఈనెల 23 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఐదు రోజుల గడువు పొడిగింపుతో మరికొందరు దరఖాస్తు చేసుకున్నారు. జనగామ జిల్లాలో ఇప్పటివరకు 1600కు పైగా దరఖాస్తులు వచ్చాయని విశ్వసనీయ సమాచారం. ఇంకెవరైనా టెండర్లకు దరఖాస్తు చేసుకోవాలని ఉంటే ఈరోజు ఒక్క మాత్రమే అవకాశం ఉంది.

Similar News

News October 23, 2025

వరుసగా డకౌట్లు.. కోహ్లీ కెరీర్‌లో తొలిసారి

image

లాంగ్ గ్యాప్ తర్వాత వన్డే సిరీస్ ఆడుతున్న విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా గడ్డపై ఫెయిల్ అవుతున్నారు. వరుసగా రెండు మ్యాచుల్లో డకౌట్ అయ్యారు. తన కెరీర్‌లో ఇలా వరుస ODIల్లో డకౌట్ కావడం ఇదే తొలిసారి. దీంతో విరాట్‌కు ఏమైందని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. రన్ మెషీన్ తిరిగి ఫామ్ అందుకోవాలని ఆశిస్తున్నారు.

News October 23, 2025

రాష్ట్రానికి తుఫాను/వాయుగుండం ముప్పు?

image

AP: అక్టోబర్ 27 నుంచి 30 మధ్యలో తుఫాను లేదా వాయుగుండం కావలి-మచిలీపట్నం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ నిపుణలు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో కోస్తా అంతటా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇప్పటికే అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయని, ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. అటు ప్రస్తుతం కోస్తా జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.

News October 23, 2025

మాడుగుల: కార్తీక మాసంలో పిక్నిక్ స్పాట్ ఇది!

image

మాడుగులకు 3కి.మీ దూరంలో ఉన్న శ్రీఉబ్బలింగేశ్వర ఆలయం కార్తీక మాసంలో మంచి పిక్నిక్ స్పాట్‌గా గుర్తింపు పొందింది. చుట్టు ఎత్తైన కొండలతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి ఉంది. కార్తీకమాసంలో ఎక్కువ మంది భక్తులు స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ వనభోజనాలు చేస్తుంటారు. ఈ ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఈశ్వరుని విగ్రహం, శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహాలు ఉన్నాయి. గతంలో ఈ ప్రాంతంలో సినిమా, సీరియల్స్ షూటింగులు జరిగాయి.