News February 23, 2025
జనగామ: మహా శివరాత్రి.. మరో 3 రోజులే!

శివరాత్రి వేడుకలకు ఓరుగల్లు పెట్టింది పేరు. WGL నగరంలోని వేయి స్తంభాల గుడి, సిద్ధేశ్వరాలయం, మెట్టుగుట్ట సహా పలు దేవాలయాలు భక్తులతో పండుగరోజు నిండిపోతాయి. ఐనవోలు(HNK), రామప్ప(ములుగు), కాళేశ్వరాలయం(BHPL), పాలకుర్తి సోమేశ్వర(జనగామ), కురవి వీరభద్రస్వామి(MHBD) దేవాలయాలు జాగారం ఉన్న శివ భక్తులతో కిటకిటలాడతాయి. రాత్రంతా భక్తుల భజనలు, కీర్తనలతో దద్దరిల్లుతాయి. మీరు ఏ గుడికి వెళ్తున్నారో కామెంట్ చేయండి.
Similar News
News July 9, 2025
మెదక్: ‘మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్నదే లక్ష్యం’

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సంబరాలు జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ నగేశ్ పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు, మహిళా సంఘ సభ్యులతో కలిసి సంబరాలు ప్రారంభించారు. ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. డీపీఎం యాదయ్య, అడల్ట్ ఎడ్యుకేషన్ జిల్లా అధికారి మురళి, కళాకారులున్నారు.
News July 9, 2025
ఉల్లాస్-అక్షరాంద్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: కలెక్టర్

అక్షరాస్యతను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉల్లాస్-అక్షరాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ బంగ్లాలో జిల్లాస్థాయి అధికారులతో కాన్ఫరెన్స్ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. 100 గంటల శిక్షణతో ఈ ఏడాది 97,200 నిరీక్షరాశులను అక్షరాస్యులుగా తీర్చిదిద్ది ప్రథమ స్థానంలో ఉంచాలని కలెక్టర్ సూచించారు.
News July 9, 2025
అల్లూరి జిల్లాలో అరుదైన ఎగిరే ఉడుత

జీకేవీధి మండలం పారికల గ్రామంలో పాంగీ చందు అనే గిరిజనుడు బుధవారం ఉదయం చేను దున్నేందుకు వెళ్లగా అక్కడ చనిపోయిన ఎగిరే ఉడత కనిపించింది. ఉడతను గ్రామంలోకి తీసుకురాగా చూసేందుకు ప్రజలు గుమిగూడారు. వాడుక భాషలో మనుబిల్లి అని పిలుస్తారని స్థానికులు వెల్లడించారు. ఎగిరే ఉడత (ఫ్లయింగ్ క్విరిల్) ఏజెన్సీ గ్రామాలలో కనిపించడం చాలా అరుదని, ఎక్కడి నుంచో ఎగిరి వెళ్తూ పడిపోయి చనిపోయిందని భావిస్తున్నారు.