News April 4, 2025
జనగామ మార్కెట్ యార్డ్ 3 రోజులు బంద్

జనగామలోని మార్కెట్ యార్డుకు 3 రోజులు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ ఛైర్మన్ శివరాజ్ యాదవ్ తెలిపారు. భారీ మొత్తంలో వ్యవసాయ ఉత్పత్తులు వచ్చిన కారణంగా యార్డ్‌లో స్థలం లేదన్నారు. దీంతో శుక్రవారం సెలవు ప్రకటించారు. శనివారం జగ్జీవన్ జయంతి, ఆదివారంతో కలిపి మొత్తం 3 రోజులు మార్కెట్‌లో క్రయవిక్రయాలు జరగవని పేర్కొన్నారు. సోమవారం తిరిగి పున:ప్రారంభం ప్రారంభమవుతుందని, రైతులు సహకరించాలని కోరారు.
Similar News
News April 4, 2025
PDPL: ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు: కలెక్టర్

పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. మంథని మండలం దుబ్బపల్లి గ్రామ శివారులో సర్వే నెంబర్ 173లో ఉన్న 10 ఎకరాల ప్రభుత్వ భూమిలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురి చేయాలని చూస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News April 4, 2025
పిల్లలతో RCB ప్లేయర్ల సెల్ఫీలు.. వైరల్

టాలెంటెడ్ యంగ్ క్రికెటర్లతో RCB ప్లేయర్లు విరాట్ కోహ్లీ, కృనాల్ పాండ్య, పడిక్కల్ సెల్ఫీలు దిగారు. వారితో సరదాగా మాట్లాడి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. తమ ఆరాధ్య క్రికెటర్లతో ఫొటోలు దిగడంతో పిల్లలు సంతోషం వ్యక్తం చేశారు. పైన ఫొటోలు చూడొచ్చు.
News April 4, 2025
NRPT: ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు పరిశీలించిన కలెక్టర్

నారాయణపేట మండలం అప్పంపల్లి గ్రామంలో గత ఫిబ్రవరి 21న ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. లబ్ధిదారు దేవమ్మ అనే మహిళ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. కాగా శుక్రవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆ ఇంటి నిర్మాణ పనులను ఈరోజు పరిశీలించారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఎంపీడీవో సుదర్శన్, పంచాయతీ కార్యదర్శికి సూచించారు. అలాగే గ్రామంలోని షమీ బేగం, ఆశా బేగం ఇళ్లను పరిశీలించారు.