News January 12, 2026

జనగామ: ‘మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి’

image

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్రీదేవితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో ఫొటో ఓటరు జాబితా ప్రకటన, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటన అంశాలపై రివ్యూ నిర్వహించారు.

Similar News

News January 30, 2026

మేడారంలో అవి తుస్ పాసులే!

image

మేడారం జాతరలో వీవీఐపీ, వీఐపీ దర్శనం పాసులు ఉత్తుత్తి పాసులుగానే మిగిలిపోయాయి. పేరుకు గేట్ మీద వీవీఐపీ దర్శనం ఉంది కానీ, గద్దెలకు దూరంగా పంపుతున్నారు. నానా పైరవీలు చేసి పాస్ సంపాదించామని డాంబికంగా చెప్పుకున్నా, పోలీసుల నెట్టివేతకు ఆమడ దూరంలో ఉండిపోయారు. వచ్చే సారికి ఆ పాస్‌లకు స్వస్తి పలికి అందరికీ ఒకే పెద్ద లైన్ పెడితే కనీసం గద్దెలైనా కనిపిస్తాయని భక్తులు చెబుతున్నారు.

News January 30, 2026

NGKL జిల్లాలో మూడు మున్సిపాలిటీలలో 521 నామినేషన్లు!

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో మూడు మున్సిపాలిటీల పరిధిలో 521 నామినేషన్లు దాఖలైనట్లు కలెక్టర్ సంతోశ్ తెలిపారు. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో 224, కల్వకుర్తి మున్సిపాలిటీలో 152, కొల్లాపూర్‌లో 145 నామినేషన్లు దాఖలు అయినట్లు పేర్కొన్నారు. బీజేపీ 100, బీఆర్ఎస్ 156, కాంగ్రెస్ 163, బీఎస్పీ 11, సీపీఎం ఒకటి, స్వతంత్ర అభ్యర్థులు 75 చోట్ల, ఇతరులు 12చోట్ల నామినేషన్ వేశారు.

News January 30, 2026

చిరంజీవి సినిమా అరుదైన రికార్డు

image

చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం సరికొత్త రికార్డు సృష్టించింది. ఒక్క నైజామ్ ఏరియాలోనే 30 లక్షల+ మంది సినిమాను చూసినట్లు మేకర్స్ వెల్లడించారు. ఆల్ టైమ్ రీజినల్ ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ మూవీ మూడో వారంలోనూ మంచి కలెక్షన్లతో దూసుకెళ్తోందని తెలిపారు. కాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.360+ కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే.