News February 16, 2026

జనగామ మున్సిపాలిటీ కార్యాలయ పరిధిలో నిషేధాజ్ఞలు

image

జనగామ మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎంపిక నేపథ్యంలో జనగామ మున్సిపల్ కార్యాలయం వద్ద భద్రత ఏర్పాటు చేసినట్లు CP సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. మున్సిపల్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో బీఎన్‌ఎస్ 163 ప్రకారం నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు ఇవి అమలులో ఉంటాయని, ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నేరమని హెచ్చరించారు.

Similar News

News February 21, 2026

జంగారెడ్డిగూడెంలో ఏసీబీ ఎటాక్

image

జంగారెడ్డిగూడెంలో ఏసీబీ దాడులు కలకలం రేపాయి. ఆవుపాడుకి చెందిన అచ్యుత దుర్గ సాయి డ్రగ్ లైసెన్స్ కోసం ఈనెల 6న ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోగా డ్రగ్ ఇన్స్పెక్టర్ కంపా సురేష్‌ను సంప్రదించారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ మెడికల్ షాప్ అసోసియేషన్ కోశాధికారి తడికమళ్ళ శివరామకృష్ణను కలవాలని చెప్పగా రూ.20,000 ఇవ్వాలని చెప్పడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. శుక్రవారం నగదు ఇచ్చే సమయంలో వారిని అదుపులోకి తీసుకున్నారు.

News February 21, 2026

ఒక్క పెన్షన్ తొలగించలేదు: మంత్రి

image

AP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్రమంగా ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అర్హులందరికీ ఒకటో తేదీనే పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని స్పష్టం చేశారు. గత 20 నెలల్లో మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లినవారి పెన్షన్లు మాత్రమే రద్దు చేశామని వెల్లడించారు. పెన్షన్లు, రుణాలపై జగన్ నోటికొచ్చినట్లు మాట్లాడి, ప్రజల్లో భయాలు సృష్టిస్తున్నారని కొండపల్లి మండిపడ్డారు.

News February 21, 2026

ఖమ్మం: ‘ఏప్రిల్ 20 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు’

image

ఖమ్మం జిల్లాలో ఏప్రిల్ 20 నుంచి 27 వరకు సార్వత్రిక పదో తరగతి, ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో చైతన్యజైని తెలిపారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 28 నుంచి మే 5 వరకు జరుగుతాయని పేర్కొన్నారు. తెలంగాణ సార్వత్రిక విద్యా పీఠం ఆధ్వర్యంలో జరిగే ఈ పరీక్షలకు విద్యార్థులు సిద్ధం కావాలని ఆమె సూచించారు.