News April 7, 2025

జనగామ: మూడెకరాల్లో పంట సాగు.. ఎకరానికే రైతు రైతుబంధు?

image

మూడెకరాల్లో పంట సాగు చేసినప్పటికీ తమకు రైతు రైతుబంధు అందలేదంటూ రైతులు గ్రామపంచాయతీ ముందు నిరసన చేపట్టిన ఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలంలోని ఇప్పగూడం గ్రామంలో చోటు చేసుకుంది. 3 ఎకరాల్లో పంట సాగు చేస్తే ఎకరానికే రైతుబంధు అందిందని, ఏఈవోలు క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టలేదని రైతులు ఆరోపించారు. గ్రామంలో 72 మందికి రావాల్సి ఉందని, ఇప్పటికైనా రైతుబంధు అందించి రైతులను ఆదుకోవాలని వారు కోరారు.

Similar News

News October 18, 2025

జిల్లాలో 2,645 హెక్టార్లలో ఆయిల్ ఫాం సాగు: కలెక్టర్

image

జిల్లాలో ప్రస్తుతం 2,645 హెక్టార్ల విస్తీర్ణంలో అయిల్ పామ్ సాగు అవుతుందని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి తెలిపారు. విజయనగరం రూరల్ మండలం కొండకరకాంలో సాగు అవుతున్న ఆయిల్ పామ్ తోటను కలెక్టర్ సందర్శించారు. 2025-26 సంవత్సరానికి 26 మండలాలు ఆయిల్ పామ్ సాగుకు అనుకూలంగా గుర్తించడం జరిగిందని 1850 హెక్టార్లు లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందన్నారు. శత శాతం రాయితీతో మొక్కలు పంపిణీ చేస్తామన్నారు.

News October 18, 2025

రాజమండ్రి: 20న పీజీఆర్‌ఎస్‌కు సెలవు

image

దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 20(సోమవారం) రాష్ట్ర ప్రభుత్వ సెలవు దినాన్ని పురస్కరించుకుని జిల్లా, డివిజన్, మండల, సచివాలయ స్థాయిలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్‌) నిర్వహించడం లేదని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రజలు తమ సమస్యలను 1100 టోల్ ఫ్రీ నంబర్‌కు లేదా meekosam.ap.gov.in ద్వారా తెలియజేయవచ్చని ఆమె శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

News October 18, 2025

భారత్, ఆస్ట్రేలియా మ్యాచుకు వర్షం ముప్పు

image

భారత్, ఆస్ట్రేలియా మధ్య 3 మ్యాచుల వన్డే సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడనుండటంతో రేపు పెర్త్ వేదికగా జరిగే మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆక్యూవెదర్ ప్రకారం ఈ మ్యాచుకు వర్షం పలుమార్లు అంతరాయం కలిగించే అవకాశం ఉంది. వర్షం వల్ల టాస్ ఆలస్యమయ్యే ఛాన్సుందని, మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడే అవకాశాలు 35% పెరగొచ్చని అంచనా.