News January 31, 2025
జనగామ: రహదారి భద్రత నియమాలను పాటించాలి: కలెక్టర్

జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డీసీపీ రాజ మహేంద్ర నాయక్, ఏఎస్పీ పండారి చేతన్ నితిన్‌లతో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ రహదారి భద్రతపై జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రహదారి భద్రతా ప్రమాణాలను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
Similar News
News March 1, 2025
నిర్మల్: రంజాన్ మాసంలో ఇబ్బందులు కలగకుండా చర్యలు: ఎస్పీ

రంజాన్ మాసంలో ముస్లింలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. శుక్రవారం ముస్లిం సోదరులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మసీదుల వద్ద ప్రార్థనా సమయాల్లో ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా దుకాణాలను అదనపు సమయాల్లో తెరిచి ఉంచేందుకు అనుమతులు ఇస్తామన్నారు.
News March 1, 2025
ఇంకా నయం జెలెన్‌స్కీని ట్రంప్ కొట్టలేదు: రష్యా

ట్రంప్, జెలెన్‌స్కీ వాగ్వాదంపై రష్యా స్పందించింది. ఇంతటి గొడవలో జెలెన్‌స్కీని ‘కొట్టకుండా’ ట్రంప్ చాలా సంయమనం పాటించారని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా అన్నారు. మీటింగ్‌లో ఆయన అన్నీ అబద్ధాలే మాట్లాడారని ఆరోపించారు. ఇక వైట్‌హౌస్‌లో జరిగిన ఘటన జెలెన్‌స్కీకి చెంపదెబ్బ లాంటిదని రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్ పేర్కొన్నారు. ఆయనను ‘అవమానం జరిగిన పంది’గా అభివర్ణించారు.
News March 1, 2025
నిర్మల్: వృత్తి నైపుణ్యాన్ని అలవర్చుకోవాలి: డీఈవో

నూతన ఉపాధ్యాయులు వృత్తి నైపుణ్యాన్ని అలవర్చుకోవాలని జిల్లా విద్యాధికారి రామారావు అన్నారు. శుక్రవారం 2024 ఎస్‌జీటీ ఉపాధ్యాయులకు మూడు రోజుల శిక్షణ తరగతులను పంచ సీల్ కళాశాలలో నిర్వహించారు. కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులందరూ తమ సర్వీసులో విద్యార్థులకు ఏ విధంగా క్రమశిక్షణతో వెలిగి పురోగతి సాధించాలో శిక్షణ అందించారు. ఎంఈఓ నర్సయ్య, విజయ్ కుమార్, అశోక్ వర్మ తదితరులు పాల్గొన్నారు.