News March 7, 2025

జనగామ: రామచంద్రం కుటుంబ సభ్యులను పరామర్శించిన అదనపు కలెక్టర్

image

చరిత్రలో పేరుగాంచిన చాకలి ఐలమ్మ మనవడు చిట్యాల రామచంద్రం మరణించిన విషయం తెలిసిందే. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశాల మేరకు శుక్రవారం అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పింకేశ్ కుమార్, ఘనపూర్ (స్టేషన్) ఆర్డీవో వెంకన్న, పాలకుర్తి తహశీల్దార్ శ్రీనివాస్ పాలకుర్తిలో నివాసం ఉంటున్న వారి కుటుంబాన్ని పరామర్శించి, ప్రభుత్వం తరఫున అంత్యక్రియలకు రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందించారు.

Similar News

News September 18, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 18, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.52 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.05 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.10 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.33 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.16 గంటలకు
✒ ఇష: రాత్రి 7.28 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News September 18, 2025

నిరంతరాయ శ్రమతోనే మంచి ఫలితాలు సాధ్యం: కలెక్టర్

image

కరీంనగర్‌లో పోలీస్, అటవీ శాఖ పరీక్షల కోసం శిక్షణ పొందుతున్న పెద్దపల్లి జిల్లా అభ్యర్థులను కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం కలిశారు. అభ్యర్థులకు అందుతున్న శిక్షణ, వసతులపై సమాచారం తెలుసుకున్నారు. నిరంతర శ్రమతోనే మంచి ఫలితాలు సాధ్యమని, ప్రతిఒక్కరూ క్రమశిక్షణతో ఫోకస్‌గా ముందుకు సాగాలని సూచించారు. అగ్నివీర్ అభ్యర్థులను కూడా ఈ సందర్భంగా కలెక్టర్ ఉత్సాహపరిచారు. శిక్షణాధ్యాపకులు, అధికారులు పాల్గొన్నారు.

News September 18, 2025

KNR: SRR కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

image

KNR సిటీలోని SRR ప్రభుత్వ కళాశాలలో వివిధ కోర్సులలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దోస్త్ 2వ విడత స్పాట్ అడ్మిషన్స్ ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం నేడు, రేపు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ కే.రామకృష్ణ తెలిపారు. కళాశాలలో వివిధ కోర్సుల్లో 57 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. స్పాట్ అడ్మిషన్స్ కోసం ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ కాపీలతో సమయానికి హాజరుకావాలన్నారు.