News March 15, 2025
జనగామ: రిజర్వాయర్ నుంచి నీటి విడుదల

నర్మెట్ట మండలం బొమ్మకూరు రిజర్వాయర్ ఎడమ, కుడి కాలువల నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా కుడి కాలువ ద్వారా జనగామ మరియు బచ్చన్నపేట మండలం పరిధిలోని పలు గ్రామాలలో 15000 ఎకరాలకు, అదేవిధంగా ఎడమ కాలువ ద్వారా నర్మెట మరియు రఘునాథపల్లి మండలం పరిధిలోని పలు గ్రామాలలో 6000 ఎకరాలకు నీటిని విడుదల చేశారు.
Similar News
News March 18, 2025
NLG: జిల్లాలో పుంజుకున్న ఎల్ఆర్ఎస్ ప్రక్రియ

నల్గొండ జిల్లా వ్యాప్తంగా లేఅవుట్ రెగ్యులర్ రెగ్యులేషన్ (ఎల్ఆర్ఎస్) ప్రక్రియ ముమ్మరంగా సాగుతుంది. అనధికార లేఅవుట్లను క్రమబద్ధీకరించినందుకు గత ప్రభుత్వం 2020 ఆగస్టులో ఎల్ఆర్ఎస్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో జిల్లాలో ప్రజల నుంచి స్పందన వచ్చింది. మార్చి 31 లోగా రెగ్యులరైజ్ చేసుకుంటే ఫీజులు 25% రాయితీ ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ వేగవంతమైంది.
News March 18, 2025
7 సెకన్లలోనే గుండె జబ్బుల నిర్ధారణ.. NRIకి సీఎం ప్రశంసలు

AP: గుండె జబ్బులను నిర్ధారించే సిర్కాడియావీ యాప్‌ను రూపొందించిన NRI విద్యార్థి సిద్ధార్థ్(14) CM చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్‌ను కలిశారు. యాప్ గురించి అడిగి తెలుసుకున్న సీఎం విద్యార్థిని ప్రశంసించారు. వైద్యరంగంలో మరిన్ని ఆవిష్కరణలు చేయాలని ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ యాప్‌ను సిద్ధార్థ్ ఏఐ సాయంతో రూపొందించారు. దీంతో ఇప్పటికే గుంటూరు ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించారు.
News March 18, 2025
NLG: జూనియర్ కాలేజీల్లో బోధన కష్టాలు గట్టెక్కినట్టే!

నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్ల కొరత తీరనున్నది. గత 13 ఏళ్లుగా పూర్తిస్థాయి అధ్యాపకులు లేక జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధన అంతంత మాత్రంగానే సాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నియామకాలు చేపట్టడంతో జిల్లాకు సుమారు 50 మంది వరకు కొత్త అధ్యాపకులు రానున్నట్లు సమాచారం. దీంతో అధ్యాపకుల కొరత తీరనుండడంతో బోధన కష్టాలు ఇక గట్టెక్కనున్నాయి.