News February 7, 2026

జనగామ: రెండో విడత ఇంటర్ ప్రాక్టికల్స్‌లో 97 మంది గైర్హాజరు

image

జనగామ జిల్లాలోని 10 పరీక్ష కేంద్రాల్లో శనివారం జరిగిన ఇంటర్మీడియట్ రెండో విడత ప్రాక్టికల్ పరీక్షలకు 97 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఐఈవో జితేందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 64 మంది, మధ్యాహ్నం 33 మంది గైర్హాజరు అయ్యారని వెల్లడించారు. జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు శ్రీనివాస్, శేఖర్, జనగామ జిల్లా కేంద్రంలోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు చెప్పారు.

Similar News

News February 14, 2026

రిటైర్మెంట్ లైఫ్ ఫుల్ సేఫ్.. పెన్షన్‌ + హెల్త్ కవర్‌కు PFRDA ప్లాన్!

image

ఇకపై పెన్షన్ స్కీమ్స్‌తో పాటే హెల్త్ కవర్‌నూ అందించేందుకు PFRDA ప్లాన్ చేస్తోంది. రిటైర్మెంట్ తర్వాత వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది లేకుండా ఇన్వెస్టర్ల డబ్బులో 30% వైద్య అవసరాలకు కేటాయించేలా ‘Swasthya’ ప్లాన్‌ను రూపొందించే యోచనలో ఉంది. పెన్షన్ ఫండ్స్ స్పాన్సర్ చేసే ICICI, Axis, Tata వంటివి దీనిపై కసరత్తు చేస్తున్నాయి. దీంతో తక్కువ ప్రీమియంతోనే ఇన్సూరెన్స్, హాస్పిటల్స్‌లో మంచి డిస్కౌంట్లు లభిస్తాయి.

News February 14, 2026

NGKL: ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి!

image

NGKL జిల్లా ఊర్కొండ మండల తిమ్మనపల్లి గేటు వద్ద తెల్లవారుజామున విషాదం నెలకొంది. శ్రీశైలం వెళ్తున్న కర్ణాటక భక్తుల వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శ్రీశైల మల్లన్న దర్శనానికి వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదం ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

News February 14, 2026

రూ.19.60 లక్షల వేతనంతో ఉద్యోగం

image

‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు’ అన్న మాటను పుట్టపర్తి మండలం వెంగళమ్మ చెరువుకు చెందిన షేక్ కరిష్మా నిజం చేశారు. బీటెక్ CSE ఫైనల్ ఇయర్ చదువుతున్న ఆమె ఆస్ట్రేలియాకు చెందిన రైజ్ సంస్థ నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్‌లో ఎంపికయ్యారు. ఏకంగా ₹19.60లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించినట్లు కళాశాల యాజమాన్యం వెల్లడించింది. పేద కుటుంబం నుంచి వచ్చిన కరిష్మా, పట్టుదలతో ఈ విజయం సాధించి యువతకు స్ఫూర్తిగా నిలిచారు.