News September 14, 2025

జనగామ: రైలులో నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

జనగామ రైల్వే స్టేషన్‌లో ఆదివారం రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ వైపు వెళ్లే ఎగువ లైన్‌లో రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో మృతి చెందాడు. మృతదేహాన్ని జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి చాతి పై గౌరీ అనే పచ్చబొట్టు ఉందని, మృతుడికి సంబంధించిన వివరాలు తెలిస్తే 9247800433 రైల్వే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.

Similar News

News September 14, 2025

KNR: పితృదేవతలు ఇంటి ద్వారం దగ్గర నిలబడతారని నమ్మకం

image

ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా పెత్తరమాస(పెద్దల అమావాస్య) ఈ రోజు ప్రారంభమైంది. తండ్రి, తాత, ముత్తాతలను తలుచుకొని పుత్రులు నిర్వహించే కార్యక్రమం ఇది. ఈ అమావాస్య రోజున పితృదేవతలు ఇంటి ద్వారం దగ్గర నిలబడతారని ప్రజల నమ్మకం. శ్రాద్ధకర్మ చేయడం ద్వారా వారి తర్వాతి తరం వారికి దీవెనలు అందుతాయని పల్లెల్లో విశ్వసిస్తారు. ఈ అమావాస్య అనంతరం విజయదశమి వేడుకలు ప్రారంభమవుతాయని, పండితులు, శాస్త్రాలు తెలుపుతున్నాయి.

News September 14, 2025

గూగుల్ తల్లే.. ‘గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే’కు ఆధారం

image

గూగుల్ మ్యాప్.. మనం ఎప్పుడైనా.. ఎక్కడికైనా వెళ్లడానికి దీనిపైనే ఆధారపడతాం. అయితే ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గూగుల్ తల్లినే నమ్ముకున్నారు. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణానికి సంబంధించి ఎన్ని కిలో మీటర్ల దూరం ఉంటుందనే విషయంపై గూగుల్ మ్యాప్ ఆధారంగా ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ రోడ్డు దాదాపు 210 నుంచి 230 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని తెలుస్తోంది.

News September 14, 2025

జగిత్యాల: RTC లాజిస్టిక్స్ పార్సిళ్ల వేలం

image

జగిత్యాలలోని కొత్త బస్టాండ్ TGS RTC Logistics (కార్గో) కేంద్రంలో 40 రోజుల పైబడిన వినియోగదారులు తీసుకువెళ్లని పెండింగ్‌లో ఉన్న పార్సిళ్లను ఈనెల 17వ తేదీ బుధవారం వేలం వేయనున్నట్లు JGTL RTC డీ.ఎం. కల్పన ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు లాజిస్టిక్స్ కేంద్రంలో ఈ వేలం నిర్వహించనున్నట్లు ఆమె ప్రకటించారు. ఆసక్తి గల వారు సమయానికి హాజరై వేలంలో పాల్గొనవచ్చని సూచించారు.