News March 21, 2024
జనగామ: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

రైలు కింద పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జనగామలో బుధవారం జరిగింది. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ రమణారెడ్డి వివరాల ప్రకారం.. జనగామ రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్ ఫారం సమీపంలో 50 ఏళ్ల వయసు ఉండే ఓ వ్యక్తి రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి దగ్గర ఎలాంటి ఆధారాలు లేవన్నారు. తెలుపు రంగు చొక్కా, నలుపు రంగు పాయింట్ ధరించి ఉన్నాడని పేర్కొన్నారు.
Similar News
News October 20, 2025
అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి: వరంగల్ కలెక్టర్

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి అని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆమె జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సుఖశాంతులతో పండుగను ఆనందంగా సురక్షితంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
News October 19, 2025
వరంగల్: 23 వరకు గడువు.. 27న డ్రా

బీసీ బంద్, బ్యాంకుల బంద్‌తో మద్యం షాపునకు దరఖాస్తులు వేసే ఉత్సాహకులు రాలేకపోయామని, వారు చేస్తున్న విజ్ఞప్తి మేరకు దరఖాస్తులు స్వీకరించడానికి గడువు పెంచుతున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. ఈ నెల 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ నెల 23న కలెక్టర్ల సమక్షంలో జరగాల్సిన మద్యం షాపుల డ్రాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 27న డ్రా తీయనున్నట్లు చెప్పారు.
News October 17, 2025
వరంగల్: పంటల కొనుగోళ్లపై కలెక్టర్ సమీక్ష

ధాన్యం, పత్తి, మక్క పంటల కొనుగోలు ప్రక్రియపై వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద సమీక్షించారు. రైతుల ప్రయోజనాల కోసం కొనుగోళ్లు పారదర్శకంగా, వేగంగా జరగాలని, కేంద్రాల సౌకర్యాలు, తూక యంత్రాలు, గోదాములు, సమాచారం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. సమీక్షలో జిల్లా వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ అధికారులు, మండల అధికారులు పాల్గొన్నారు.